గోపీచంద్ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆంధ్రుడు’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. 2005 లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్నే అందుకుంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైంది హీరోయిన్ గౌరీ పండిట్. ఈ మూవీ సక్సెస్ అందుకోవడంతో తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు దక్కాయి కానీ సరైన పాత్రలను కలిగిన సినిమాలను ఎంపిక చేసుకోవడంలో ఈమె ఫెయిల్ అయ్యింది. దాంతో తరువాత ఈమె నటించిన సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి.
తెలుగులో ఈమె 5,6 సినిమాల్లో నటించింది. హిందీ, కన్నడ భాషల్లో కూడా ఒక్కో సినిమా చొప్పున చేసింది. ఇక సినిమాలు వర్కౌట్ కావడం లేదు అని భావించి 2011లో బాలీవుడ్ యాక్టర్ నిఖిల్ ద్వివేదిని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఈమె చివరిగా తెలుగులో నటించిన చిత్రం ‘హౌస్ ఫుల్’. ఇదిలా ఉండగా.. ఈమె రీసెంట్ పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :