Gautami: వెబ్ సిరీస్ లకు సెన్సార్ తప్పనిసరి: నటి గౌతమి
January 7, 2023 / 07:45 PM IST
|Follow Us
ప్రస్తుత కాలంలో ఓటీటీల హవా నడుస్తోంది. కొత్త కొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, రియాల్టీ షో లు కూడా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ లు చూసేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. అయితే వెబ్ సిరీస్ లకు సెన్సార్ అనుమతి అవసరం లేకపోవడం వల్ల వీటిలో అభ్యంతరకర సన్నివేశాలు, హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలామంది వెబ్ సిరీస్ లకు, షార్ట్ ఫిలిమ్స్ కి కూడా సెన్సార్ అనుమతి తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వాదన వినిపిస్తున్నారు.
సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే ఆ సినిమాకి సెన్సార్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. సెన్సార్ బోర్డు సభ్యులు ఆ సినిమా చూసిన తర్వాత సినిమాలో ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు, హింసాత్మక సన్నివేశాలను తొలగిస్తూ ఉంటారు. ఇలాంటి సన్నివేశాలు లేకపోతేనే ఆ సినిమా విడుదల చేయడానికి అంగీకరిస్తారు. సినిమాల లాగే వెబ్ సిరీస్ లకు కూడా సెన్సార్ అనుమతి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో సీనియర్ నటి గౌతమి కూడా వెబ్ సిరీస్ ల సెన్సార్ విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గౌతమి ఎన్నో సినిమాలలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. గౌతమి నటిగా గుర్తింపు పొందటమే కాకుండా కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇక తాజాగా వెబ్ సిరీస్ లకు సెన్సార్ బోర్డ్ అనుమతి గురించి గౌతమీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమి మాట్లాడుతూ.. సినిమాల లాగే వెబ్ సిరీస్ లకు కూడా సెన్సార్ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని ఈ సందర్భంగా ఆమె తెలియజేసింది. ఇదిలా ఉండగా గౌతమి ప్రస్తుతం సినిమాలలో నటించటమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఉంది. ఈమె నటించిన “స్టోరీ ఆఫ్ థింగ్స్ ” అనే వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి సోనీ లీవ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రసారామ్ కానుంది.