Hari Teja: తన కూతురి సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే అంటున్న హరితేజ..!
June 25, 2021 / 07:09 PM IST
|Follow Us
ప్రముఖ నటి,యాంకర్ అయిన హరితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ లో, సినిమాల్లో నటించిన హరితేజ అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 1’ లో ఓ కంటెస్టెంట్ పాల్గొని ఫైనల్ వరకు వెళ్లి తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. నిజానికి ఆమె విన్నర్ అవుతుంది అని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.అయినప్పటికీ బిగ్ బాస్ ద్వారా పెరిగిన క్రేజ్ ఈమెకు వరుస సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది.
ఇక హరితేజకు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. హరితేజ చివరిగా నటించిన మూవీ ‘హిట్’. ఇదిలా ఉండగా.. గతేడాది లాక్ డౌన్ టైం లో హరితేజ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. తన బేబీ బంప్ తో ఫోటో షూట్లో కూడా పాల్గొంది. అంతేకాదు ఈమె సీమంతం ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. మొత్తానికి ఇటీవల హరితేజ ఓ పాపకి జన్మనిచ్చింది. ఇప్పటివరకు తన పాప ఫేస్ ను ఈమె చూపించలేదు కానీ,
ఎప్పటికప్పుడు ఆ పాపకి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది హరి తేజ. త్వరలోనే ఆమె కూతురిని పూర్తిగా చూపిస్తానని మొన్నామధ్య చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా హరితేజ తన కూతురికి నామ కారణం చేసింది. భూమిక దీపక్ రావ్ అంటూ తన కూతురికి పేరు పెట్టింది హరితేజ. దీనికి వివరణ కూడా ఇచ్చింది. ‘భూమి అంటే సహనంతో ఉంటుందని అంతా అనుకుంటున్నారు.. కానీ వాళ్లకు ఏం తెలుసు సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే అని’ అంటూ పేర్కొంది హరితేజ. అంతేకాదు తన ఫ్యామిలీ పిక్ ను కూడా షేర్ చేసింది.