Himaja: జాన్వీ కపూర్ సెట్ లో అలా ఉంటుంది!: హిమాజ

  • January 10, 2024 / 01:15 PM IST

కెరియర్ మొదట్లో బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించే అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నటువంటి వారిలో నటి హిమజ ఒకరు. ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తర్వాత బుల్లితెర సీరియల్స్ లో నటించడం పూర్తిగా మానేసి వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకుంటు ఉన్నారు. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇకపోతే ఈమె ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమాలో కూడా కీలకపాత్రలో నటించబోతున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల దేవర సినిమా నుంచి విడుదలైనటువంటి గ్లింప్స్ గురించి అదే విధంగా హీరోయిన్ జాన్వి కపూర్ గురించి మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా హిమజ మాట్లాడుతూ మేము ఈ సన్నివేశాలు చేసేటప్పుడు సెట్ లోనే ఉన్నాము కానీ ఈ విధంగా డైరెక్టర్ ఎన్టీఆర్ గారిని చూపిస్తారని అసలు ఊహించలేదు కెమెరా విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అంటూ ఈమె గ్లింప్స్ వీడియో పై చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక జాన్వీ కపూర్ సెట్లో ఎలా ఉంటారనే ప్రశ్న కూడా ఈమెకు ఎదురు కావడంతో ఆమె స్టార్ డాటర్ కదా అలాగే మెయింటెనెన్స్ చేస్తారు అనుకున్నాను కానీ జాన్వీ కపూర్ మాత్రం డౌన్ టూ ఎర్త్ అంటూ చెప్పారు. చాలా సింపుల్ గా ఉంటారని ఇక ఏదైనా ఒక షార్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ గారు టేక్ ఓకే అని చెప్పినా ఇంకా చేస్తాను ఇంకా మంచి ఔట్ పుట్ ఇచ్చేందుకు చాలా తాపత్రయపడతారు అంటూ హిమజ జాన్వీ కపూర్ గురించి మాట్లాడారు.

ఇక మీరు ఏ ఏ సినిమాలలో నటిస్తున్నారని ప్రశ్నించడంతో నేను బాలయ్య 109 లో కూడా నటిస్తున్నానని ఏదో తంతే వచ్చి నందమూరి ఫ్యామిలీలో పడ్డానని ప్రస్తుతం ఈ ఫ్యామిలీ సినిమాలతోనే బిజీగా ఉన్నానని ఈమె తెలియచేశారు. ఇక లాస్ట్ ఇయర్ కూడా కొన్ని సినిమాలు చేశాను అవన్నీ కూడా ఈ ఇయర్లోనే విడుదల కాబోతున్నాయి అంటూ ఈ సందర్భంగా హిమజ కామెంట్స్ చేశారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus