Honey Rose: జలకన్య డ్రస్సులో ట్రెండ్ సెట్టర్ గా మారిన హనీ రోజ్
April 19, 2023 / 08:43 PM IST
|Follow Us
హనీ రోజ్ ఇప్పుడు టాలీవుడ్ తన వైపు చూసేలా చేసిన హంస.. వీరసింహారెడ్డి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ ‘హనీ రోజ్’. ఒక్క సినిమాతోనే తన అందం, అభినయంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో నిర్వహించారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక బ్యూటీ అందరి దృష్టిని తనపై పడేలా చేసుకుంది.
అంతేకాకుండా బాలయ్య బాబుతో స్టేజి పైన మలయాళం లో మాట్లాడుతూ నవ్వులు పూయించేసింది. దీంతో ఆమె ఎవరో ఆమె డీటెయిల్స్ మొత్తం బయటపడ్డాయి. తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో హనీ రోజ్ అనే యాక్టర్ రెడ్ డ్రస్ లో కనిపించి అందరి కళ్ళు తన మీద పడేలా చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ మలయాళం ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ. కేరళ లో పుట్టి పెరిగిన హనీ రోజ్ 14 ఏళ్ళలోనే యాక్టర్ అయ్యింది.ఆ తర్వాత 2005లో నటిగా మలయాళంలో తొలి సినిమా చేసింది.
అనంతరం అడపా దడపా సినిమా లలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ (Honey Rose) వచ్చింది. 2012లో విడుదలైన త్రివేంద్రం లాడ్జ్ అనే సినిమాతో బ్రేక్ రావడంతో అప్పటినుంచి మలయాళ సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ వచ్చింది. అయితే ఈమెకు వీరసింహారెడ్డి తొలి సినిమా కాదు.గతంలో ఆలయం, ఈ వర్షం సాక్షిగా అనే రెండు తెలుగు సినిమాలలో నటించింది. ఆ సినిమాలో పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
బాలయ్య బాబు సినిమాలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే ఐటెం సాంగ్ లో బాలయ్య బాబుతో కలిసి చిందులు వేయడంతో పాటుగా ఈ సినిమాలో లో బాలకృష్ణకు తల్లిగా కూడా నటించింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టవ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా హానీ రోజ్ ఎరుపు రంగు ఉన్న జలకన్య డ్రస్సు వేసుకొని తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది.. జలకన్య డ్రస్సులో ట్రెండ్ సెట్టర్ గా మారిన హనీ రోజ్