షూటింగ్ లో గాయపడ్డ ఇలియానా.. వైరల్ అవుతున్న పిక్..!

  • November 10, 2020 / 03:04 PM IST

ఇలియానా… ఈ పేరుకి ప్రత్యేక పరిచయమవసరం లేదు. వై.వి.యస్.చౌదరి డైరెక్షన్లో రామ్ హీరోగా తెరకెక్కిన ‘దేవదాస్’ చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ కావడం ఆ వెంటనే వచ్చిన ‘పోకిరి’ చిత్రం కూడా ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ వెంటనే తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించే ఛాన్స్ కొట్టేసి నెంబర్ వన్ హీరోయిన్ స్టేటస్ ను దక్కించుకుంది ఇలియానా.

కానీ అదే టైములో బాలీవుడ్ పై ఉన్న మోజుతో అక్కడ అడుగుపెట్టింది.అయితే అక్కడ ఈమెకు సక్సెస్లభించలేదు.అయినా సరే ఈమె తిరిగి టాలీవుడ్ కు అడుగుపెట్టలేదు. అటు తరువాత లవ్ ఫెయిల్యూర్ కావడం… అలాగే బాగా ఒళ్ళు చెయ్యడంతో ఈమెకు అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. ప్ర‌స్తుతం ఈ గోవా బ్యూటీ బ‌ల్వీంద‌ర్ సింగ్ జ‌నుజ డైరెక్షన్లో ర‌ణ్‌దీప్ హుడా హీరోగా నటిస్తున్న ‘అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్‌లీ’ అనే సినిమాలో న‌టిస్తోంది.ఇదిలా ఉండగా..

ఈ చిత్రం షూటింగ్లో ఇలియానా చేతికి చిన్నపాటి గాయం అయ్యింది. త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన చేతికున్న గాయాన్ని చూపిస్తూ ఉన్న ఫోటోని షేర్ చేసింది. ‘రొమాంటిక్ కామెడీ సినిమా షూటింగ్లో ఎవరైనా గాయపడతారు?’ అంటూ ఫన్నీ కామెంట్ కూడా పెట్టింది. అయితే ఈ చిన్న గాయానికి ఈమె అభిమానులు ‘జాగ్రత్త మేడం’ ‘సో స్యాడ్’ ‘గెట్ విల్ సూన్’ అంటూ కామెంట్లు పెట్టి ఈ టాపిక్ ను వైరల్ చేస్తున్నారు.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus