నటి జయసుధ పై ప్రముఖ నిర్మాత సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!
August 1, 2022 / 05:20 PM IST
|Follow Us
సీనియర్ నటి మరియు సహజనటిగా పేరొందిన జయసుధ.. ఇటీవల ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె “ముంబై నుండి వచ్చిన హీరోయిన్లను నిర్మాతలు ఎలా ట్రీట్ చేస్తారు , ఇక్కడి హీరోయిన్స్ ని ఎలా ట్రీట్ చేస్తారు? అనే విషయాల పై స్పందించింది. అంతేకాకుండా తనకు .. పద్మశ్రీ అవార్డు రాకపోవడంపై కూడా కొంత రాజకీయం ఉంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అయితే జయసుధ చేసిన ఈ కామెంట్ల పై నిర్మాత ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేస్తారు.
ఆయన మాట్లాడుతూ.. “జయసుధ గారు.. అవార్డుల విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలు సరైనవే. మీకు అన్యాయం జరిగింది అని మీకు అనిపిస్తే .. నిలదీసే(ప్రశ్నించే) హక్కు మీకు ఉంది. కానీ మీరు ఎమ్మెల్యేగా ఉండి.. మీరు పని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బాలకృష్ణ సినిమాకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో బాలకృష్ణ నటనకు నంది అవార్డు వస్తుందని అంతా భావించారు. అలానే నంది అవార్డుల కమిటీ లోని సభ్యులంతా ఏకాభిప్రాయంతో బాలకృష్ణకు నంది అవార్డు ఇవ్వాలని సూచించారు.
కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు.. రామారాజ్యం అంటే రాముడు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు వస్తారు.. కాబట్టి ఆ సినిమాకు అవార్డు ఇవ్వకూడదని ఆయన పేరు కొట్టేసి వేరే హీరో కి(మహేష్ బాబుకి) అవార్డు ఇచ్చారు.అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ అవార్డులప్పుడు శ్రీరామరాజ్యం సినిమాని ఏ కేటగిరీలోనూ లేకుండా చేసింది. ఈ సినిమా అనే కాదు అసలు రాముడు, కృష్ణుడు మీద వచ్చిన ఏ సినిమాకు అవార్డు ఇవ్వలేదు. ఎందుకంటే.. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని ప్రభుత్వ పెద్దల అభిప్రాయం.
కేంద్రం విషయంలో మీరేమీ చేయలేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఇలా జరిగినప్పుడు మీరు ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. మీరేందుకు.. ఆ టైంలో ప్రశ్నించలేదు మాట్లాడలేదు?. మీకు నొప్పి కలిగినప్పుడు మాత్రమే మాట్లాడతారా..? ఇతరుల విషయంలో అన్యాయం జరిగితే మాట్లాడరా..? మీకో న్యాయం.. మిగిలిన వాళ్లకి ఓ న్యాయం అంటే ఎలా.? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే.. అందరి బాధ్యత మీరు తీసుకోవాలి కదా’’ అంటూ ప్రసన్న కుమార్ జయసుధని ప్రశ్నించారు.