కాజల్ అగర్వాల్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 13 ఏళ్ళ నుండీ ఇండస్ట్రీలో రాణిస్తుంది ఈ చందమామ. కొత్త హీరోయిన్లు ఎంతమంది వచ్చినా కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటించబోతుంది. విష్ణు మంచుతో ‘మోసగాళ్లు’ అనే చిత్రంలో కూడా నటిస్తుంది. తమిళంలో అయితే.. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇండియన్2’ అలాగే వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించబోతుంది కాజల్.
ఇక హిందీలో కూడా ‘ముంబై సాగా’ అనే చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే తన 35వ పుట్టినరోజుని జరుపుకున్న కాజల్.. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్ కు చెందిన ఓ బిజినెస్ మెన్ ను.. కాజల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి పెళ్లికి.. వీరి కుటుంబసభ్యులు కూడా అంగీకరించారని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కు అయితే.. ఎప్పుడో పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా.! అయితే కాజల్ మాత్రం తన సినిమాల పైనే ఫోకస్ పెట్టడం వల్ల లేటయ్యిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. కాజల్ పెళ్లి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు.. గతంలో కూడా ఎన్నో సార్లు ‘కాజల్ పెళ్లి చేసుకోబోతుంది’ అంటూ వార్తలు వచ్చాయి.కానీ వాటిని కాజల్ ఖండిస్తూనే వచ్చింది.