Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవర్తనపై.. క్లాస్ పీకిన కాజల్.. ఏమైందంటే?
May 22, 2024 / 06:30 PM IST
|Follow Us
కాజల్ (Kajal Aggarwal) నటించిన ‘సత్యభామ’ (Kajal’s Satyabhama) సినిమా మే 31న విడుదల కాబోతోంది. నవీన్ చంద్ర (Naveen Chandra) కాజల్ కి జోడీగా నటిస్తున్నాడు. అలాగే ప్రకాష్ రాజ్ (Prakash Raj) , నాగినీడు (Nagineedu) , రవివర్మ (Ravi Varman) , హర్షవర్ధన్ (Harsha Vardhan) వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ నటిస్తున్న ఈ సినిమాని సుమన్ చిక్కాల (Suman Chikkala) డైరెక్ట్ చేశారు. టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని రాబట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కాజల్ చురుగ్గా పాల్గొంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాజల్..
‘సత్యభామ’ సినిమా కోసం చిన్న చితకా ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలో ఆమె తన 17 ఏళ్ళ సినీ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. అదే టైంలో ఆమెకు ఎదురైన ఇబ్బందులు గురించి కూడా చెప్పుకొచ్చింది. కాజల్ మాట్లాడుతూ.. “కొన్నేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న టైంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.
తొలిరోజు షూటింగ్ పూర్తయ్యాక వెళ్లి వ్యానిటీ వ్యాన్ లో కూర్చుని రిలాక్స్ అవుతున్నాను. ఆ టైంలో ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్.. వ్యాన్లోకి పర్మిషన్ లేకుండా వచ్చి .. ‘షర్ట్ విప్పేసి అతని ఛాతిపై ఉన్న ఒక టాటూని చూపించాడు.ఆ టాటూ నా పేరుతో ఉంది. ఆ టైంలో నాకు చాలా ఆనందం వేసింది అదే టైంలో అతను సడన్ గా అలా చేసే సరికి భయం వేసింది. దీంతో మందలించి పంపించేశాను” అంటూ చెప్పుకొచ్చింది.