ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి కవిత చనిపోయిందంటూ భారీగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ విషయం పై చర్చలు కూడా మొదలయ్యాయి. మరోపక్క కవిత బంధుమిత్రులు కంగారు పడి ఆమెకి ఫోన్ చేయడం జరిగింది. దీంతో స్వయంగా నటి కవిత నేరుగా మీడియా ముందుకు వచ్చి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.’నిన్నటి నుండీ పలు యూట్యూబ్ ఛానల్స్ లో ఇంకా పలు సోషల్ మీడియా వేదికల్లో నేను చనిపోయాను అంటూ ప్రచారం చేస్తున్నారు.
దాంతో నా బంధుమిత్రులు, స్నేహితులు అంతా నాకు ఫోన్లు చేసి ‘మీరు బాగానే ఉన్నారు కదా’.. అంటూ అడుగుతున్నారు. ఏమైంది అని నేను ప్రశ్నిస్తే మీకు ఒక వీడియో పెడతాను అది ఒకసారి చూడండి’ అంటూ వాళ్ళు తెలిపారు. ఆ వీడియోలు చూస్తే నేను చనిపోయినట్టు చెప్పుకొచ్చారు. దయచేసి ఇలాంటి ప్రచారాన్ని నమ్మొద్దు. నేను చెన్నైలో జీ టీవీ సీనియర్ షూటింగ్లో పాల్గొంటున్నాను. ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళు కూడా దయచేసి ఇది ఆపండి, అలాగే ఆ వీడియోలను డిలీట్ చేయండి.
లేదంటే నేను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అంటూ ఈమె చెప్పుకొచ్చారు. గతంలో ‘రంగస్థలం’ మహేష్, చంద్రమోహన్, షకీలా వంటి నటీనటుల పై కూడా ఇలాంటి ప్రచారం జరిగింది. ఇలాంటి వార్తలు చూసి వారి చాలా బాధ పడినట్లు వారు చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఎవరివైనా సీనియర్ నటీనటుల ఫోటోలు కనుక కనిపిస్తే ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరు ఆకతాయి మూక పనిగట్టుకుని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!