బాలీవుడ్లో కెరీర్‌ను ప్రారంభించి.. టాలీవుడ్‌కి వచ్చి రెండు సినిమాలు ట్రై చేసి.. మళ్లీ బాలీవుడ్‌కి వెళ్లిపోయింది కృతి సనన్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కృతి సనన్.. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు పడిందట. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ షో కాఫీ విత్ కరణ్‌లో చెప్పుకొచ్చింది. కొన్ని పరిమితుల వల్ల ఎలాంటి అవకాశాలు కోల్పోయింది అనేది కూడా చెప్పింది.
‘హీరో పంతి’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. అయితే అంతకుముందే ‘లస్ట్ స్టోరీస్’ ఆంథాలజీ కోసం ఆడిషన్స్‌లో కూడా పాల్గొందట. అయితే ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో శృతి మించిన బోల్డ్ సీన్స్ ఉండటంతో వెనకడుగు వేసిందట. అంత బోల్డ్‌గా ఉన్న పాత్రలను చేయడానికి అమ్మ ఒప్పుకోదు, అందుకే వాటి విషయంలో మినహాయింపు ఇవ్వాలని దర్శకుడు కరణ్ జోహార్‌ను కోరినట్లు కృతి చెప్పింది. అయితే అదే ఆడిషన్‌కి హాజరైన కియారా అడ్వాణీ ఆ పాత్ర చేయడానికి అంగీకరించడంతో..
కరణ్ జోహార్ దర్శకత్వంలో నటించే అవకాశం కోల్పోయానని కృతి సనన్ తెలిపింది. అంతేకాదు కెరీర్ ప్రారంభంలో తన పొడవు తనకు సమస్యగా మారిందని కూడా కృతి సనన్ చెప్పుకొచ్చింది. కొంతమంది హీరోల సరసన నటించడానికి తన ఎత్తే తనకు అడ్డంకిగా ఉండేదని తెలిపింది. అయితే చాలా ప్రయత్నాల తర్వాత మంచి పాత్రల్లో నటించే అవకాశం లభించింది అని కృతి చెప్పింది.
ప్రస్తుతం కృతి సనన్… టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘గణపత్’లోనూ కథానాయికగా నటిస్తోంది. ముందుగా చెప్పినట్లు ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’లో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలవుతోంది. ఇవి కాకుండా ‘బేడియా’, ‘షెహజాదా’ తదితర చిత్రాల్లోనూ కృతి కనిపించనుంది. తెలుగులో కృతి నటిస్తోంది అంటూ కొన్ని సినిమాల పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే ఇంకా ఏవీ ఓకే అవ్వడం లేదు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.