Laya: ఆ ప్లాప్ సినిమాలో నటించకుండా ఉండుంటే నా కెరీర్ మరోలా ఉండేది : లయ
March 6, 2023 / 06:03 PM IST
|Follow Us
తెలుగు ప్రేక్షకులకు లయని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘స్వయంవరం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది. ‘ప్రేమించు’ ‘హనుమాన్ జంక్షన్’ ‘దేవుళ్ళు’ ‘శివరామరాజు’ ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో ఆపై ఈమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగలేదు. దీంతో గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యింది.
ఈమెకు ఇద్దరు పిల్లలు. ఇక 2018 లో ఈమె ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది కానీ ఆ మూవీ ప్లాప్ కావడంతో అది ఫలించలేదు. ‘అరవింద సమేత’ సినిమాలో ఈమెకు ఛాన్స్ వస్తే.. ఈమె రిజెక్ట్ చేసింది. కానీ స్ట్రాంగ్ రీఎంట్రీ ఇవ్వాలని ఈమె చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ.. తాను ఓ ప్లాప్ సినిమాలో నటించినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు తెలిపి షాకింగ్ కామెంట్స్ చేసింది.
లయ మాట్లాడుతూ.. “కె.విశ్వనాథ్, కోడి రామకృష్ణ , సీనియర్ వంశీ,ఈవీవీ ,ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఎస్వీ కృష్ణారెడ్డి గారితో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడం నా దురదృష్టం. కాకపోతే వాళ్లతో కలిసి పనిచేయడమే ఒక అందమైన జ్ఞాపకంగా అనిపిస్తూ ఉంటుంది.’ప్రేమిస్తే’ సినిమాలో అంధురాలి పాత్రను చేయొద్దని చాలామంది చెప్పారు. అలాంటి పాత్రలు చేస్తే కెరీర్ దెబ్బతింటుందని అన్నారు.
అయినా అలాంటి పాత్రలు అరుదుగా వస్తాయని భావించి ఓకే చేశాను. సినిమా హిట్ అయ్యింది.. నంది అవార్డు కూడా వచ్చింది. నా కెరీర్ లో నేను అనవసరంగా చేశాను అనే ఫీలింగ్ కలిగించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ‘మా బాలాజీ’ సినిమా అనే చెప్పాలి . ఎలాంటి సినిమాలను .. పాత్రలను ఒప్పుకోవాలనే విషయం తెలియకపోవడం వలన ఆ సినిమా చేశాను.
నా కెరీర్లో నేను చేసిన పెద్ద పొరపాటు అదే. ఆ సినిమా చేయకుండా ఉండుంటే నా కెరీర్ మరోలా ఉండేదేమో. ఆ సినిమా వల్ల నన్ను ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలకు దర్శకనిర్మాతలు సంప్రదించేవారు” అంటూ లయ చెప్పుకొచ్చింది.