సైడ్ క్యారెక్టర్లు వేసే మధు శాలిని హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. గత నెల అంటే జూన్ 17న ఈమె సైలెంట్‌గా గా పెళ్లి చేసుకుని అభిమానులని సర్ప్రైజ్ చేసింది. కోలీవుడ్ హీరో గోకుల్ ఆనంద్‌తో మధు శాలిని పెళ్లి హైదరాబాద్‌లో జరిగింది. కొద్దిపాటి బందువులు మరియు సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వీరి పెళ్లి వేడుకకు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. మధు శాలిని, గోకుల్ కలిసి ‘పంచాక్షరం’ అనే తమిళ చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీ టైములో వీరి మధ్య పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత అది స్నేహంగా మారి ప్రేమకు దారి తీసి చివరికి ఇలా పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది అని స్పష్టమవుతుంది.మెగాస్టార్ చిరంజీవి-శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘అందరివాడు’ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది మధుశాలిని. అటు తర్వాత ‘కితకితలు’ ‘అనుక్షణం’ ‘గోపాల గోపాల’ ‘గూఢచారి’ వంటి చిత్రాల్లో నటించింది. ఈమె వయసు ఇప్పుడు 33ఏళ్ళు. ఇక మధుశాలిని- గోకుల్ ల అన్ సీన్ మ్యారేజ్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా వాటిని రెడంట్జ్ స్టూడియో వారు పోస్ట్ చేశారు. వాటిని మీరు కూడా లుక్కేయండి :
1
2
3
4
5
6
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!