సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంతో మంది నటీనటులు లేదా వారి కుటుంబ సభ్యులు మృత్యువాత పడుతున్నారు.తాజాగా నటి మహిమ చౌదరి తల్లి మరణించడం అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి. మహిమ చౌదరి కూడా గత కొన్ని నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 2022లో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టు తేలింది.అప్పటినుండి ఆమె క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ వస్తోంది. ఆమె ఫైనల్ గా క్యాన్సర్ ను జయించి హ్యాపీగా ఉన్న తరుణంలో ఆమె తల్లి కన్నుమూయడం జరిగింది.
ఈ విషయాల పై మహిమ చౌదరి ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘ నాకు అత్యంత సన్నిహితురాలైన నా తల్లి చనిపోయింది. కొన్ని నెలలుగా ఆమె కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆమె ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా ప్రాణాలు విడిచి నన్ను శోకసంద్రంలో పడేసి వెళ్ళిపోయింది. వైద్యులు ఆమెకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చినా లాభం లేకపోయింది. బుధవారం నాడు ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచినట్టు ఆమె తెలిపింది.
తల్లి మరణంపై మాన్విత పెట్టిన ఎమోషనల్ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.ఆ పోస్ట్ లో తల్లితో ఉన్న ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. ఇక క్యాన్సర్ నుండీ కోలుకున్న తర్వాత మాన్వితకి ఇలాంటి షాక్ తగులుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. ఆమె తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.