అందుకే నా సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి : మల్లికా శెరావత్

  • July 2, 2019 / 04:46 PM IST

‘మీటూ’ ఉద్యమం ముగిసిపోయింది అని అనుకుంటున్నప్పుడల్లా.. ఎవరో ఒకరు ‘నన్ను కూడా పలానా దర్శకుడు, హీరో, నిర్మాత వేధించారంటూ’ మళ్ళీ ఆ ఉద్యమాన్ని గుర్తుచేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో మల్లికా శెరావత్ కూడా చేరింది. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన సినిమాల సంఖ్య బాగా తక్కువే. ఏదో ఏడాదికి ఒకటి అన్నట్టు సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా ‘బూ సబ్కి ఫేటేగి’ అనే చిత్రంలో నటించింది మల్లికా శెరావత్. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా కపిల్ శర్మ టాక్ షో లో పాల్గొంది మల్లికా. ఈ ఇంటర్వ్యూలో తానెదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది.

మల్లికా శెరావత్ మాట్లాదుతూ.. “బాలీవుడ్లో ఎంతో మంది లైంగిక వేదింపులు ఎదుర్కొన్నట్లుగానే నేను కూడా కొందరు దర్శకుల నుండీ లైంగిక వేదింపులను ఎదుర్కొన్నాను. నాతో ఓ పాట చిత్రీకరిస్తున్న సమయంలో దర్శకుడు నన్ను చాలా వేదించాడు. నా నడుమును అందంగా చూపిస్తానంటూ అసహ్యంగా నాతో ప్రవర్తించాడు. నా నడుము పై కోడి గుడ్లు పెట్టి అత్యంత నీచంగా వ్యవహరించాడు. ఆ సంఘటన నన్ను చాలా బాధ పెట్టింది. అతని ప్రవర్తన నాకు చాలా కోపం తెప్పించింది. తెర వెనుక హీరోలు మరియు దర్శకులతో సన్నిహితంగా ఉండకపోవడం వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను. నాకు రావాల్సిన ఆఫర్లు కూడా.. కొన్ని నేను వారికి సహకరించను అనే ఉద్దేశ్యంతో వారి స్నేహితులకు లేదా లవర్స్ కు ఇచ్చుకున్నారు. వారు నన్ను అసభ్యకరంగా అడిగిన వాటన్నిటికీ ముందే నో చెప్పేదాన్ని. అందుకే నా సినిమాల సంఖ్య చాలా తక్కువ” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus