భర్త మరణం తర్వాత తొలిసారి అలా కనిపించిన మీనా..వీడియో వైరల్!
February 16, 2023 / 07:59 PM IST
|Follow Us
బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా అనంతరం ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందరి సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు.ఇలా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే ప్రస్తుతం మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూనే 2009వ సంవత్సరంలో బెంగళూరుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ నైనిక అనే ఓ కుమార్తె కూడా ఉంది. ఈ చిన్నారి కూడా బాలనటిగా పలు సినిమాలలో నటించి మెప్పించారు.ఇలా సంతోషంగా ఉన్న మీనా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
గత ఏడాది జూన్ నెలలో మీనా భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా మీనా భర్త మరణించిన తర్వాత ఈమె ఎంతగానో కృంగిపోయారు. ఇలా భర్తను కోల్పోయి మీనా బాధలో ఉండగా పలువురు సినీ సెలబ్రిటీలు ఆమెను తరచూ కలుస్తూ తనని పరామర్శిస్తూ ఆ బాధ నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇలా ఎంతోమంది సీనియర్ నటిమనులు తరచూ మీనా ఇంటికి వెళ్లి అక్కడ ఆమెతో కాసేపు సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు.
అయితే తాజాగా నటి సంఘవి కూడా మీనా ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇలా సంఘవి మీనా ఇద్దరు కలిసి ఒక డాన్స్ వీడియో చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని మీనా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది.ఇలా భర్త మరణం తర్వాత మొదటిసారి మీనా సంతోషంగా కనపడుతూ ఇలాంటి డాన్స్ వీడియోని షేర్ చేయడంతో అభిమానులు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ ఈ డాన్స్ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.