Nabha Natesh: ఎముకలు విరిగిపోయాయి.. అందుకే సినిమాలకు దూరం అయ్యాను
January 10, 2023 / 04:30 PM IST
|Follow Us
నభా నటేష్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈ అమ్మాయి … యూత్ కు కలల రాకుమరిగా మారిపోయింది. సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే … చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత రామ్ కు జోడీగా చేసిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
అయితే 2022 లో ఈమె నుండీ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈమె ఏ సినిమాలోనూ నటించలేదు. కానీ గ్లామర్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.అయితే ఈమె సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అనే డౌట్ అందరికీ వచ్చి ఉండొచ్చు. దీనికి కారణం ఆమెకు యాక్సిడెంట్ కు గురవ్వడం అని తెలుస్తుంది. ఈ విషయం పై ఆమె క్లారిటీ ఇస్తూ.. ” నేను గత కొంత కాలం నుండి మీకు దూరంగా ఉంటున్నాను అని నాకు తెలుసు.
నేను మిమ్మల్ని మిస్ అయినట్టుగానే మీరు కూడా నన్ను మిస్ అయి ఉంటారని నాకు తెలుసు. 2022 నాకు ఎంతో కష్టంగా గడిచింది.. నాకు యాక్సిడెంట్ అయ్యింది.అవును నేను యాక్సిడెంట్ కు గురయ్యాను. నా ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. ఎముకలు విరిగిపోయాయి. సర్జరీలు కూడా జరిగాయి.. శారీరకంగా, మానసికంగా ఎంతో బాధను అనుభవించాను.. ఆ బాధనంతా కూడా నేను మీ ప్రేమతో జయించాను .
అదేమీ అంత సులభంగా అయితే జరగలేదు. మీ ప్రేమతోనే అది సాధ్యమైంది.ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను.. ఇకపై మళ్లీ సినిమాలతో మీ ముందుకు వస్తాను.. మునుపటి కంటే మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాను ” అంటూ నభా నటేష్ ఓ లెటర్ ద్వారా తెలియజేసింది.