ఎన్టీఆర్ తో సెకండ్ ఛాన్స్ కొట్టేసిన నిత్యామీనన్

  • April 12, 2019 / 03:49 PM IST

ఇప్పటివరకూ రాజమౌళి తీసిన 11 సినిమాల్లో ఏ ఒక్క సినిమాకి జరగని విధంగా మొట్టమొదటిసారిగా రాజమౌళి సినిమాలో నుంచి ఒక హీరోయిన్ తప్పుకొంది. రాజమౌళి కొన్ని నెలలపాటు కష్టపడి రెడీ చేసుకున్న టీం నుంచి ఒన్నాఫ్ ది మెయిన్ హీరోయిన్ ఎగ్జిట్ అవ్వడంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయడం రాజమౌళికి చాలా కష్టంగా మారింది. అది ఒక బ్రిటిష్ మహారాణి పాత్ర.. ఆ పాత్రకు ఎవరైనా ఫారిన్ మోడల్స్ మాత్రమే సెట్ అవుతారు. బాలీవుడ్ హీరోయిన్స్ ను ఎవర్నైనా తీసుకోవచ్చు కానీ.. ఆల్రెడీ ఆలియాను రామ్ చరణ్ కోసం ఫైనల్ చేసేశారు. ఇద్దరూ బాలీవుడ్ హీరోయిన్స్ అయిపోతే బాగుండదు కాబట్టి ఇప్పుడు మరో హాలీవుడ్ నటిని వెతుకుతున్నాడు రాజమౌళి. ఈలోపు ఈ సినిమా కోసం నిత్యామీనన్ ను కూడా సంప్రదిస్తున్నారు అనగానే ఎన్టీఆర్ సరసన ఆమెను ఫైనల్ చేశారనే కథనాలు వెలువడుతున్నాయి.

నిజానికి బ్రిటిష్ యువరాణి పాత్రకు నిత్య సరిగ్గా సరిపోతుంది. ఇదివరకు “జనతా గ్యారేజ్”లోనూ ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించింది నిత్యామీనన్. దాంతో అందరూ ఆమెను మరో హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయారు. అయితే.. రాజమౌళి నిత్యాను సంప్రదించింది హీరోయిన్ రోల్ కోసం కాదని.. వేరే ప్రధాన పాత్ర కోసమని తెలుస్తోంది. సో, మరో హీరోయిన్ కోసం రాజమౌళి ప్రయాస ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus