ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పాయల్ ఘోష్..!
June 29, 2020 / 04:03 PM IST
|Follow Us
ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ .. డిప్రెషన్ కు లోనయ్యి అఘాయిత్యం చేసుకోవడంతో ఇండియా మొత్తం విషాదానికి గురయ్యింది. సుశాంత్ ‘డిప్రెషన్ కు లోనవ్వడానికి కారణం.. బాలీవుడ్ ఇండస్ట్రీలో పాతుకుపోయి ఉన్న నేపోటిజమే’ అంటూ అక్కడున్న స్టార్స్ ను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు నెటిజన్లు. అంతేకాదు కొంతమంది సినిమాలను ‘బ్యాన్ చెయ్యాలి’ అంటూ నిరసన కూడా చేశారు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ లో కూడా నెపోటిజం ఉంది అంటూ ఉదయ్ కిరణ్ ఇష్యూ ని గుర్తు చేసుకుంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు.
ఈ క్రమంలో ఇక్కడ స్టార్ హీరోల పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ‘ఎన్టీఆర్ కూడా నెపోటిజం బాపతే’ అంటూ కొందరు కామెంట్స్ చెయ్యగా.. వాటికి చాలా ఘాటుగా బదులిచ్చింది పాయల్ ఘోష్. ఈ విషయం పై ఆమె మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ ను తిట్టేవారికి ఆయన గురించి అస్సలు తెలిసి ఉండదు. అతనో హార్డ్ షిప్..! తన స్వశక్తితో పైకి వచ్చాడు. మీరంతా మూసుకొని ఉండండి’ అంటూ మండిపడింది పాయల్ ఘోష్.
మొన్నటికి మొన్న మీరా చోప్రా ఇష్యూలో కూడా ఎన్టీఆర్ కు మద్దతు తెలుపుతూ.. అలాగే ఆయన అభిమానులకు అండగా నిలిచింది పాయల్. గతంలో ఎన్టీఆర్ తో ఈమె ‘ఊసరవెల్లి’ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో ఈమెది కూడా కీలకపాత్ర కూడా.! ఇక ‘ప్రయాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ.