Payal Rajput: అనారోగ్య సమస్యలను తెలుపుతూ షాకింగ్ కామెంట్ చేసిన పాయల్!
March 21, 2023 / 06:50 PM IST
|Follow Us
ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. నటి పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాలోని గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె తర్వాత పలు సినిమాలలో నటిస్తూ వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయారు. తాజాగా ఈమె విష్ణు నటించిన జిన్నా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. ఇలా ఒకవైపు సినిమాలలోనూ మరోవైపు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేతికి సైలెన్ నీడిల్ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.
ఇలా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అభిమానుల అసలు తనకు ఏం జరిగింది అంటూ కంగారు పడ్డారు అయితే తన ఆరోగ్యం గురించి తాజాగా పాయల్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ…నేను నీళ్లు చాలా తక్కువగా తాగేదాన్ని అందు కారణంగా కిడ్నీ ఇన్ఫెక్షన్ కి గురయ్యానంటూ అసలు విషయాన్ని వెల్లడించారు.
గత కొద్దిరోజులుగా కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్ తీసుకున్నాను. మళ్లీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. రోడ్‌బ్లాక్‌లు ఉన్నప్పటికీ అడ్డంకులను అధిగమించాలనీ తెలిపారు. రాబోయే నా ప్రాజెక్ట్ కోసం షూటింగ్ ఆపలేకపోయాను. షో మస్ట్ గో ఆన్. ఈసారి బిగ్గర్ అండ్ బెటర్ గా ఉంటుంది. మీరందరూ మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని మరోసారి గుర్తు చేస్తున్నారు.
జాగ్రత్తా అంటూ తన ఆరోగ్యం గురించి తెలియజేయడమే కాకుండా అభిమానులకు కూడా ఈమె పలు జాగ్రత్తలను తెలియజేశారు. ఇలా తన ఆరోగ్యం గురించి చెబుతూ పాయల్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసినటువంటి అభిమానులు తాను తొందరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.