వాళ్ళకు ఏ పనీ లేదు.. డబ్బు కోసం ‘బిగ్ బాస్’ కు వచ్చారు…!
October 3, 2019 / 07:28 PM IST
|Follow Us
ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో ఏది అంటే అందరూ టక్కున చెప్పే పేరు ‘బిగ్‌బాస్’. నార్త్ లో పాపులర్ అయిన ఈ షో ఇప్పుడు సౌత్ లో కూడా ప్రజాధారణ పొందుతోంది. ఇక హిందీలో ఎప్పుడూ ‘బిగ్ బాస్’ పై వివాదాలు వస్తూనే ఉంటాయి. ఇక హిందీ ‘బిగ్ బాస్2’ లో పాల్గొన్న కంటెస్టెంట్, నటి పాయల్ రోహ్తగి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. గతవారం అంటే.. సెప్టెంబర్ 29న హిందీ ‘బిగ్‌బాస్ సీజన్ 13’ ఘనంగా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో అందరూ సెలబ్రిటీలనే ఎంచుకోవడం విశేషం.
అమీషా పటేల్, కొయినా మిత్రా, సిద్ధార్థ శుక్లా, రేష్మీ దేశాయ్, అబూ మాలిక్ వంటి సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారు. ఇక వీరి పై పాయల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. పాయల్ రోహ్తగి తన ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ.. “అమీషా పటేల్, కొయినా మిత్రా, రేష్మి దేశాయ్, సిద్ధార్ధ్ శుక్లా, అబూ మాలిక్..వీరందరూ ఇప్పుడు ఎలాంటి పనిలేక … ఇప్పుడు డబ్బు కోసం ‘బిగ్‌బాస్’ కి వచ్చారు. ఇక తక్కువ డబ్బులకే ఒప్పుకున్నారని ‘బిగ్ బాస్’ నిర్వాకాలు వీళ్ళని తీసుకున్నారు. నేను ‘బిగ్‌బాస్ 2’ లో పాల్గొన్నప్పుడు… నాకూ ఎలాంటి పని లేదు…” అంటూ ట్వీట్ లో పేర్కొంది. ఇక ఈ విషయం పై పాయల్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.