Poojitha, Naresh: నరేష్ వల్ల సాయం పొందిన వారు వందల్లో ఉన్నారు: పూజిత
July 7, 2022 / 11:35 AM IST
|Follow Us
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల నుంచి హీరోగా, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ సోషల్ మీడియా వార్తలలో పెద్ద ఎత్తున నిలుస్తున్నారు. దీనికి కారణం కేవలం ఆయన నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారని వార్తలు రావడమే. ఈ విధంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వేగవంతం కావడంతో ఈ వ్యవహారంలోకి నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి వీరి వివాదం రోజు రోజుకు పెరిగిపోతుంది.
నరేష్ వ్యక్తిత్వం గురించి మూడో భార్య రమ్య ఎన్నో ఆరోపణలు చేశారు. చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నటి పూజిత. నటి పూజిత హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా నరేష్ తనకు అన్నయ్యతో సమానమని, ఎన్నో సమయాలలో తాను నాకు ఒక అన్నయ్యగా అండగా నిలబడ్డారని పూజిత తెలియజేస్తూ రమ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇకపోతే రమ్య నరేష్ ను ఉమెనైజర్ అని సంబోధించడాన్ని పూజిత కొట్టి పారేశారు.
ఈ క్రమంలోనే పూజిత మాట్లాడుతూ…నేను ఇండస్ట్రీలో హీరోయిన్ గా పని చేశాను. నాకు ముక్కు మొహం సరిగా ఉన్నాయి. నేను కూడా నరేష్ తో కలసి ఎన్నో సినిమాలలో చేశాను. ఆయన నిజంగానే ఉమెనైజర్ అయితే నన్ను కూడా బయటకు వెళ్దాం పూజ అని అడగాలి కదా ఆయన ఎప్పుడూ అలా నన్ను అడగలేదు. నేను అనారోగ్యం పాలైతే నరేష్ ఆ సమయంలో నాకు ఎంతో సహాయం చేశారు అయితే ఆయన సహాయం చేశారని నేను తనకి సపోర్ట్ చేయడం లేదనీ పూజిత వెల్లడించారు.
నేను మాత్రమే కాదు నాలాగా ఎంతోమంది నరేష్ సహాయం పొందిన వాళ్లు ఉన్నారు.మీకు ఎవరికి తెలియని విషయం ఏమిటంటే నరేష్ ద్వారా ఏకంగా 1500 మంది సహాయం పొందిన వాళ్లు ఉన్నారు అంటూ ఈ సందర్భంగా పూజిత నరేష్ గురించి వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని నేను మీడియా ముందు తెలియజేస్తానని చెప్పగా నరేష్ వద్దు పూజిత ఇలాంటి విషయాలు చెబితే నువ్వు డి గ్రేడ్ అవుతావు అంటూ ఆయన నన్ను ఆపారు పండు పూజిత నరేష్ గురించి వెల్లడించారు. ప్రస్తుతం పూజిత నరేష్ వ్యక్తిత్వం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.