ఢీ సాక్షిగా ప్రేమలో పడిన ప్రదీప్ హీరోయిన్ పూర్ణ..!
September 3, 2020 / 07:10 PM IST
|Follow Us
తెలుగులో అంత్యత ప్రజాదరణ కలిగిన రియాలిటీ షోలలో ఢీ ఒకటి. ప్రతి వారం ఈ షోని మిస్ కాకుండా చూసేవారు లక్షలలో ఉంటారు. అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్సులకు మించి ఈ షోలో చాలా ఉంటాయి. లవ్, ఎమోషన్స్, కామెడీ మొత్తం కలగలిపి జనరంజకంగా ఈ షో సాగుతుంది. ఒకప్పుడు ఒక యాంకర్ జడ్జెస్ తో సాగిన ఈ షో, ఆ తరువాత టీమ్స్, ప్రతి టీమ్ కి ఒక అందమైన యాంకర్, బ్యూటిఫుల్ జడ్జెస్ తో సాగుతుంది.
రష్మీ, సుడిగాలి సుధీర్ వచ్చాక షోకి మరింత గ్లామర్ యాడ్ అయ్యింది. షోలో వీరిద్దరి రొమాన్స్ హైలెట్ గా ఉండేది. వీరి జంట సక్సెస్ కావడంతో కామెడీ కోసం ఆదిని తీసుకోవడం జరిగింది. ఎప్పటి నుండో ఉన్న వర్షిణిని ఆదికి జత చేశారు. రష్మీ, సుధీర్ ప్రేమ కహానీలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఆది, వర్షిణి జంట రొమాన్స్. లవ్ ట్రాక్స్ అలరిస్తున్నాయి. ఇక మధ్యలో ఆది, సుధీర్ మరియు ప్రదీప్ ల కామెడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా ఈ షోలో మరో జంటను జత చేశారు.
జడ్జిగా ఉన్న హీరోయిన్ పూర్ణ మరియు యాంకర్ ప్రదీప్ మధ్య రొమాన్స్ మొదలైంది. బుల్లితెరపై ఈ కొత్త ప్రేమ జంట ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. ఈటీవి లో హైయెస్ట్ టీఆర్పీ దక్కించుకుంటున్న ఈ షోకి హీరోయిన్ పూర్ణ, ప్రదీప్ ల లవ్ ట్రాక్ మరింత ఆకర్షణ చేకూర్చింది. మొత్తంగా ఢీ రోజురోజుకు కొత్తదనాన్ని సంతరించుకుంటూ దూసుకుపోతుంది.