Poorna: కుటుంబ సభ్యులు చేసిన పనికి ఉబ్బితబ్బిపోతున్న పూర్ణ!

  • March 21, 2023 / 06:48 PM IST

సినీనటి పూర్ణ గత ఏడాది జూన్ నెలలో దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె వివాహం చేసుకున్న తర్వాత తన వివాహ విషయాన్ని రహస్యంగా ఉంచారు. అయితే కొన్ని నెలలకు ఈమె తనకు పెళ్లి జరిగింది అంటూ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఈ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన కొద్ది రోజులకే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా బయటపెట్టారు.

ఈ విధంగా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ తో ఉన్నటువంటి పూర్ణ తరచూ తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా 9వ నెల ప్రెగ్నెన్సీ లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఈమె తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. అయితే తొమ్మిదవ నెలలోకి అడుగుపెట్టిన ఈమెకు తన కుటుంబ సభ్యులు సర్ప్రైజ్ ఇచ్చారని తెలుస్తుంది. ఇలా పూర్ణ తొమ్మిదవ నెలలోకి అడుగుపెట్టడంతో ఈమెకు ఎంతో ఇష్టమైనటువంటి తొమ్మిది రకాల వంటలను చేసి తన కుటుంబం తనకు తినిపించారు.

ఇలా తన భర్త ఎంతో ప్రేమగా తనకు ఇష్టమైన వంటకాలను తినిపిస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇకపోతే పూర్ణ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత తరచూ ఈమె తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

అయితే ఈమె ప్రెగ్నెన్సీలో తొమ్మిదో నెలకు చేరుకున్నారని తెలియడంతో మరికొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు ముందుగా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక పూర్ణ నటిగా వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus