గతేడాది జూన్లో దుబాయ్ బేస్డ్ బిజినెస్మెన్ షానిద్ ఆసిఫ్ అలీతో పూర్ణ వివాహం ఘనంగా జరిగింది. పూర్ణది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. షానిద్ ఆసిఫ్ అలీకి టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది తెలుసు. వారందరికీ వీసాల కోసం ఇతన్నే సంప్రదిస్తూ ఉంటారు. అలాగే అరబ్ దేశాల్లో ఉన్న ముస్లిం పెద్దలందరితో కూడా ఇతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక పూర్ణ అటు తర్వాత గర్భవతి అయిన సంగతి తెలిసిందే.
తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంది పూర్ణ. మొన్ననే 9వ నెలలో ఎంటర్ అయ్యి డెలివరీ టైం దగ్గర పడినట్టు, కొంచెం ఆందోళనకరంగా ఉంది అంటూ పూర్ణ తెలియజేసింది. అయితే మొత్తానికి పూర్ణకి డెలివరీ అయ్యింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.డెలివరీ తర్వాత తన బాబుని పూర్ణ ఎత్తుకుని కుటుంబ సభ్యుల మధ్య అదీ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేసింది.
అలాగే థాంక్యూ డాక్టర్ ఫాతిమా సఫ అండ్ ఆస్టర్ హాస్పిటల్ టీం అంటూ ఈమె కామెంట్ పెట్టింది. ఇక పూర్ణ (Poorna) పోస్ట్ చేసిన ఈ ఫోటో కొద్దిసేపటికే వైరల్ అయిపోయింది. ఆమె ఫాలోవర్స్.. ఈ ఫోటో చూసి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇటీవల వచ్చిన ‘దసరా’ సినిమాలో పూర్ణ.. ఓ ముఖ్య పాత్ర పోషించింది. విలన్ భార్యగా ఆమె పోషించిన ఈ పాత్ర సినిమాకే హైలెట్ అయ్యిందని చెప్పాలి.