Actress Poorna: శుభవార్త చెప్పిన హీరోయిన్ పూర్ణ… తల్లి కాబోతున్న నటి!
December 31, 2022 / 11:12 AM IST
|Follow Us
ఈ ఏడాది ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టగా మరి కొంతమంది సెలబ్రిటీలు అమ్మగా ప్రమోట్ అయ్యారు. ఈ క్రమంలోని ఈ ఏడాది ఎంతోమంది నటీమణులు పిల్లలకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఏడాది వివాహం చేసుకున్నటువంటి వారిలో నటి పూర్ణ ఒకరు. ఈమె తెలుగు తమిళ మలయాళ భాషలలో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇలా తెలుగులో వెండితెర సినిమాలలోను బుల్లితెర కార్యక్రమాలలోనూ సందడి చేస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న పూర్ణ దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈమె పెళ్లి విషయాన్ని ఎవరికీ తెలియకుండా కేవలం కుటుంబ సమక్షంలో ఎంతో ఘనంగా దుబాయ్ లో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన కొద్ది రోజులకు తాను పెళ్లి చేసుకున్నానని తన పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇక ఈమె జూన్ 12వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న పూర్ణ అభిమానులకు మరొక శుభవార్త తెలియజేశారు. ఈమె త్వరలోనే తల్లి కాబోతుందని గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు. ఇదే విషయాన్ని పూర్ణ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియచేయడంతో పూర్ణ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.