Actress Poorna: పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్న పూర్ణ?

  • July 4, 2022 / 03:04 PM IST

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సీమటపాకాయ్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నటి పూర్ణ. ఈ సినిమా అనంతరం పలు సినిమాలలో నటించి తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలపై కూడా సందడి చేశారు. ఈ క్రమంలోనే పూర్ణ న్యాయ నిర్ణీతగా ఢీ కార్యక్రమం ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.ఈ కార్యక్రమానికి దూరమైన ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

ఇలా ఒకవైపు సినిమాలలో మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా ఆఖండ సినిమాలో ఈమె ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు పొందారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్న పూర్ణ వైవాహిక జీవితంలో కూడా స్థిరపడాలని భావించారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం తన ప్రియుడిని పరిచయం చేస్తూ నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని వెల్లడించారు. పూర్ణ షానిద్‌ అసిఫ్‌ అలీ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకుందని తన ఫోటోని షేర్ చేస్తూ విషయాన్ని వెల్లడించారు.

ఇలా ఒక్కసారిగా ఈమె పెళ్లి విషయం చెబుతూ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారని చెప్పాలి. నిశ్చితార్థం జరుపుకున్న పూర్ణ పెళ్లి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూర్ణ తన పెళ్లి నవంబర్ 6 న జరగబోతుందని పరోక్షంగా వెల్లడించారు. ఇకపోతే చాలామంది నాది ప్రేమ వివాహం అనుకుంటారు. అయితే నా వివాహం పూర్తిగా పెద్దలు కుదర్చిన వివాహం అని ఈమె వెల్లడించారు.

ఇక వివాహమైన తర్వాత పూర్ణ తన భర్తతో కలిసి దుబాయ్ వెళ్ళబోతుందని ఇకపై తాను సినిమాలలో నటించనని ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నాను అంటూ ఈ సందర్భంగా పూర్ణ పరోక్షంగా తన పెళ్లి గురించి తెలియజేశారు. అయితే ఈ విషయం గురించి త్వరలోనే అధికారక ప్రకటన వెలవడునుందని సమాచారం.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus