Pragathi: రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి ప్రగతి..!
January 3, 2023 / 02:03 PM IST
|Follow Us
సీనియర్ నటి ప్రగతి అందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ సక్సెస్ లభించకపోవడతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయింది. అయితే తల్లి, అత్త, పిన్ని, వదిన వంటి పాత్రలకు పోటీ ఎక్కువైపోవడంతో ఈమెలోని కొత్త యాంగిల్ ను బయట పెట్టి ‘ఎఫ్2’ ‘ఎఫ్3’ వంటి సినిమాల్లో నటించింది. భవిష్యత్తులో కామెడీ చేసే స్కోప్ ఉన్న పాత్రల్లో కూడా చేయగలను అని ప్రగతి క్లారిటీ ఇచ్చింది. అలాగే మరోపక్క సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ప్రగతి.
వయసుతో సంబంధం లేకుండా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. ఇదిలా ఉండగా.. ప్రగతి పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరికీ తెలిసిన సంగతి. తన భర్తతో ఈమె విడాకులు తీసుకుని ప్రత్యేకంగా జీవిస్తుంది. తన సొంత కాళ్ళ పై నిలబడడమే కాకుండా తన కొడుకు, కూతురు ను పెద్దవాళ్ళను చేసింది. మొన్నటికి మొన్న వీళ్ళ కెరీర్ విషయంలో ఎటువంటి సాయమైనా చేస్తాను అని చెప్పిన ప్రగతి..
అది తల్లిగా తన బాధ్యత అని అయితే పెళ్లి విషయంలో నేను వాళ్ళను ఇబ్బంది పెట్టనని.. వాళ్లకు ఇష్టమైతే పెళ్లి చేసుకోమని చెబుతానని, కానీ నాకైతే వాళ్లకు పెళ్లి చేయాలనే ఉద్దేశం లేదు అని చెప్పి షాకిచ్చింది. అయితే చాలా మంది సీనియర్ నటీనటులు మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేస్తున్న తరుణంలో.. ప్రగతి కూడా రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని కొందరు నెటిజన్లు డిస్కస్ చేసుకుంది. ఇందుకు ప్రగతి స్పందిస్తూ.. ‘పెళ్లి అనే మాట అనే కన్నా కంపానియన్ అంటే బెటర్.
చాలాసార్లు నాకు కూడా కంపానియన్ ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. కానీ నా మెచ్యూరిటీ లెవెల్ కి మ్యాచ్ అయ్యే వాళ్ళు దొరకాలి. అదీకాక సింగిల్ పర్సన్ దొరకడం కష్టం. కానీ.. రావాలని ఉంటే మాత్రం అదే జరుగుతుంది అని నేను నమ్ముతాను. అయినా నాతో కొంచెం కష్టం. ఎందుకంటే..నాకంటూ కొన్ని విషయాల్లో చాలా పర్టిక్యులర్ గా ఉంటాను. సో.. నాకు ఇలాగే కావాలి, అలాగే ఉండాలి అని.! కాబట్టి .. 20 లలో ఉంటే నేను అడ్జెస్ట్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడైతే కష్టం” అంటూ తెలిపింది.