కొడుకు పుట్టినరోజు సందర్భంగా రేర్ పిక్స్ ను షేర్ చేసిన ప్రగతి..!
July 20, 2022 / 04:13 PM IST
|Follow Us
నటి ప్రగతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత రెండేళ్లలో సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ పంచిన సెలబ్రిటీ లిస్ట్ తీస్తే.. అందులో ఈమెనే టాప్ ప్లేస్ లో ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి డాన్స్ వీడియోలు, జిమ్ వర్కౌట్ వీడియోలు, అలాగే హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా..
ఈరోజు ఈమె కొడుకు పుట్టినరోజు కావడంతో.. కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను షేర్ చేసింది. ‘మై కాన్స్టెంట్ లవ్.. నీకు దేవుడు సక్సెస్ అండ్ హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాధ్యతగల మహిళను, స్ట్రాంగ్ అని అందరూ అంటున్నారు అంటే.. నా బలం నీ పుట్టుకతోనే మొదలైంది’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇక ఈ మధ్యనే ‘ఎఫ్3’ వంటి పలు హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రగతి..
ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇక ఈ మధ్యనే ఈమె పారితోషికం కూడా పెంచిందని.. ఒక్కో కాల్షీట్ కు ప్రగతి రూ.70 వేల వరకు డిమాండ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. మరోపక్క ఈమె బుల్లితెర పై కూడా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోలలో కనిపిస్తూ ఉండటం విశేషం. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ప్రగతి పోస్ట్ చేసిన తన కొడుకు ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :