Prema,Upendra: ఉపేంద్రతో ఎఫైర్స్ క్లారిటీ ఇచ్చిన నటి!

  • April 15, 2023 / 02:30 PM IST

సాధారణంగా ఒక ఇండస్ట్రీలో ఓకే హీరో హీరోయిన్ కలిసి పలు సినిమాలలో నటించిన లేదా ఇద్దరు కలిసి బయట ఎక్కడైనా కనిపించిన వారిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడం సర్వసాధారణం. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి రూమర్స్ ఎదుర్కొంటూ ఉన్నారు.అయితే గతంలో కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రతారగా వెలుగొందుతున్న నటి ప్రేమ సైతం ఈ విధమైనటువంటి రూమర్స్ ఎదుర్కొన్నారు. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో నటుడు ఉపేంద్రతో ప్రేమ ప్రయాణం కొనసాగిస్తోంది అంటూ పెద్ద ఎత్తున అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి (Prema) ప్రేమకు ఇదే ప్రశ్న ఎదురయింది. ఉపేంద్రతో లవ్ రూమర్స్ పై ఈమె స్పందిస్తూ.. ఈ వార్తలు రాసిన వారిని అడగాలి అంటూ సమాధానం చెప్పారు. ఇది అప్పట్లో ఒక గాసిప్ మాత్రమేనని కొట్టి పారేశారు. సాధారణంగా ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి వార్తలు రావడం సర్వసాధారణం.ఒక విషయం గురించి పాజిటివ్ ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు.

అలాగే నెగటివ్ ధోరణిలో కూడా మాట్లాడుతూ ఉంటారు దేనినైనా మనం స్వీకరించి ధైర్యంతో ముందుకు నడవాలని ప్రేమ వెల్లడించారు. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడుతూ ఈమె పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రేమ మాట్లాడుతూ నాకు చాలా సింపుల్ గా ఉండడం ఇష్టం. యాటిట్యూడ్ తలలో ఉంటే చాలా కష్టమని తెలియజేశారు. ఇక నాకు ఎలాంటి ఆస్తులు లేవు డబ్బు కూడా లేదని తెలిపారు.

డబ్బే మనకు శాశ్వతం కాదు మనకు అవసరమైన డబ్బు ఉంటే చాలనీ, తాను ఏ విషయం గురించి అయినా ఓపెన్ గా మాట్లాడతాను అంటూ ఈ సందర్భంగా ప్రేమ వెల్లడించారు. ఇక ఇండస్ట్రీలో తనకు సౌందర్య అంటే చాలా ఇష్టం తనతో చాలా క్లోజ్ గా ఉండే దానిననీ ఈ సందర్భంగా ప్రేమ తెలియజేశారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus