Bigg Boss 5 Telugu: టాస్క్ లో నోరు జారిన హౌస్ మేట్స్..!

  • September 16, 2021 / 10:48 AM IST

బిగ్ బాస్ ఇచ్చిన పంతం నీదా నాదా సై అనే టాస్క్ హౌస్ లో పెద్ద దుమారమే లేపింది. హౌస్ మేట్స్ ఒకరినొకరు తిట్టుకుంటూ , కొట్టుకుంటూ రెచ్చగొట్టుకుంటూ మరీ ఈగేమ్ ని ఆడారు. ఇందులో బాగంగా సాగరా సోదరా టాస్క్ లో పార్టిసిపెంట్ విజె సన్నీకి ఇంకా ప్రియాకి ఆర్గ్యూమెంట్ అయ్యింది. ఫస్ట్ ప్రియా ఈయనకేంటి ప్రాబ్లమ్ అనేసరికి సన్నీ ట్రిగ్గర్ అయ్యాడు. ఇద్దరూ కూడా మాటా మాటా అనుకున్నారు. అంతకుముందు నువ్వు నీతో మాట్లాడేంది పో అంటూ అన్నావ్ అని, అప్పుడే నీ మీద గౌరవం పోయిందని ప్రియా మాట్లాడింది. ఇక ఈటాస్క్ అవ్వగానే, మరోసారి బజర్ మోగినపుడు హౌస్ మేట్స్ ఒకరి డగౌట్స్ పై మరొకరు ఎటాక్ చేస్కున్నారు. ఒక టీమ్ ని మించి ఇంకో టీమ్ రెచ్చిపోయింది.

ఇక్కడే సన్నీని మరోసారి కదిపింది ప్రియ. నేను ఒకళ్లతో మాట్లాడుతుంటే వాడు వస్తాడు మద్యలో అని ప్రియ సన్నీ ఉద్దేశ్యించి మాట్లాడింది. దానికి సన్నీ వాడు గీడు అనకమ్మా అంటూ ప్రియాతో ఆర్గ్యూ చేశాడు. ఇద్దరి మద్యలో మాటలు పెరిగాయి. మినిమమ్ సెన్స్ ఉండాలి కదా.. ఆవిడకి అది లేదు అంటూ సన్నీ రెచ్చగొట్టాడు.. దీంతో ప్రియా మగాడివైతే రా ఆడుతుగానీ అనేసరికి సన్నీ మరింత రెచ్చిపోయాడు. ఇప్పటివరకూ ఎంతో కూల్ గా జెన్యూన్ గా అనిపించిన ప్రియ సన్నీ విషయంలో బాగా ఇరిటేట్ అయిపోయింది.

అంతేకాదు, ఆతర్వాత కూడా టాస్క్ లో హౌస్ మేట్స్ రెచ్చిపోయారు. బ్యాటెన్స్ ని దక్కించుకునేందుకు కొట్టుకున్నారు. ఫిజికల్ ఎటాకింగ్ అనేది చేస్కున్నారు. అందుకే బిగ్ బాస్ టాస్క్ ని ఆపేశాడు. ఇందులో రెండు టీమ్స్ కి ఈక్వల్ గా 5 ఫ్లాగ్స్ వచ్చాయి. మరి ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus