Priyanka Mohan: ‘ఈటి’ గురించి హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ చెప్పిన ఆసక్తికర విషయాలు..!
March 9, 2022 / 07:07 PM IST
|Follow Us
‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక అరుళ్ మోహన్. అటు తర్వాత ‘శ్రీకారం’ చిత్రంలో కూడా నటించి మెప్పించింది. అయితే ఈ రెండు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినప్పటికీ ప్రియాంకా తమిళంలో వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. శివ కార్తికేయన్ సరసన చేసిన ` డాక్టర్` సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ సక్సెస్ అయ్యి ఈమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈమె నుండీ రాబోతున్న మరో తమిళ్ డబ్బింగ్ మూవీ ‘ఈటి'(ఎవ్వరికీ తలవంచడు) మార్చి 10న విడుదల కాబోతుంది. ఈ చిత్రం తెలుగు ప్రేమేమోషన్లలో పాల్గొన్న ప్రియాంక కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.
ప్ర. తెలుగులో మీరు చేసిన రెండు సినిమాలు సక్సెస్ కాలేదు. ఆ టైములో మీ ఫీలింగ్ ఎలా ఉంది. ఇప్పుడు మీ కెరీర్ ఎలా నడుస్తుంది అనుకుంటున్నారు?
జ.కరెక్ట్ కానీ… ఆ సినిమాల టైంలోనే ‘డాక్టర్’ కి సైన్ చేశాను.అది అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది.తెలుగు ప్రేక్షకులు కూడా ఆ మూవీని ఆదరించారు.నా పాత్రకి కూడా ఆశించిన గుర్తింపు లభించింది. నా కెరీర్‌కు అది గుడ్ సైన్ అనిపించింది. తర్వాత ‘ఈటి’ చేశాను. ఇది కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది.మంచి సినిమాకి బాషతో సంబంధం ఉండదు.చిత్తూరు యాస,నేపథ్యంలో రన్ అయ్యే ‘పుష్ప’ మూవీ నార్త్‌లో హిట్ అయ్యింది. తెలుగు, తమిళ్ అని తేడా లేదు. అక్కడ చేసినా ఇక్కడ చేసినా మంచి సినిమాలే చేయాలని డిసైడ్ అయ్యాను. అవే చేస్తాను. రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు.
ప్ర.’ఈ.టి’ లో అవకాశం ఎలా వచ్చింది?
జ. `డాక్టర్` చేస్తున్నప్పుడే శివ కార్తికేయన్ సర్ తో ‘డాన్’ సినిమాలో చేసే అవకాశం కూడా వచ్చింది. అదే టైములో ‘ఈటి’ ఆఫర్ కూడా వచ్చింది.
ప్ర.’ఈటి’ లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
జ.ఈ మూవీలో నా పాత్ర రెండు వేరియేషన్స్ లో ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల కంటే కూడా ఇది పవర్ ఫుల్ గా ఉంటుంది.అలాగే మహిళలకు స్ఫూర్తినిచ్చే విధంగా కూడా నా పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చు. ముఖ్యంగా హీరోతో సమానంగా నా పాత్ర కూడా ఉంటుంది.
ప్ర. ‘ఈటి’ లో మిమ్మల్ని బాగా ఆకర్షించిన అంశం ఏంటి?
జ.ఇందులో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి,చక్కటి లవ్ స్టోరీ కూడా వుంది.అలాగే నా పాత్ర చాలా బాధ్యతతో కూడుకున్నది.’రియాలిటీలో చాలామంది ఆడవాళ్ళు ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు’ అనిపిస్తుంది మీరు మూవీ చూసాక. అందుకే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదు అని ఓకె చేశాను.
ప్ర.’ఎవరికీ తలవంచడు’ క్యాప్షన్ తో మీ పాత్రకి కూడా లింక్ ఉందట నిజమేనా?
జ. నిజం… అది హీరోకి మాత్రమే కాదు నాకు కూడా వర్తిస్తుంది. సినిమా చూశాక సొసైటీలో అందరి మహిళలకి వర్తిస్తుంది అనిపిస్తుంది. మనం న్యాయంగా నడుచుకుంటే ఎవ్వరికీ తలవంచాల్సిన పనిలేదు. అలా అని మహిళలు మాత్రమే కాదు పురుషులందరికీ కనెక్ట్ అయ్యే విధంగానే ఈ మూవీ ఉంటుంది.
ప్ర. ట్రైలర్ చూస్తుంటే… రెండు రకాల షేడ్స్ కనిపిస్తున్నాయి.ఆరంభంలో ఫ్యామిలీ డ్రామాలా.. తర్వాత యాక్షన్ మోడ్ కి వెళ్తుంది కదా?
జ.నిజమే ఇంతముందు చెప్పినట్టు ఈ మూవీలో ఆ రెండు ఇమిడి ఉంటాయి. ఇది పూర్తిగా దర్శకుడి ఆలోచన నుండీ పుట్టిన పాయింట్.ఈ కథలో హీరోయిన్‌కు సమాన ప్రాధాన్యత వుంది కాబట్టే నేను బాగా కనెక్ట్ అవ్వగలిగాను. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ట్రైలర్లో మీరు గమనించింది తక్కువే అనిపిస్తుంది మూవీ చూసాక..!
ప్ర.దర్శకుడు పాండ్ రాజ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
జ. ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియెన్స్ క్రేజ్ ఎక్కువ. అదే ఆయన బలం. ఆయన స్టైల్లోనే సినిమా ప్రారంభం అవుతుంది.. కానీ తర్వాత ఆయన జోనర్ నుండీ కాస్త బయటకి వచ్చి తీసారనే ఫీలింగ్ కల్గిస్తుంది.కానీ ఎక్కడా డిజప్పాయింట్ చెయ్యదు. ఆయన నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టి.. దేనిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయం ఆయనకి బాగా తెలుసు. అలాంటి డైరెక్టర్ తో పనిచేయడం చాలా హ్యాపీగా వుంది.
ప్ర.హీరో సూర్యతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
జ.ఆయన నిజజీవితంలో కూడా స్టార్ అనిపిస్తుంటుంది. ఆయన నుండీ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఓ వర్సటైల్ యాక్టర్. ప్రతిరోజూ షాట్ లో కొత్త విషయాలు చెబుతుంటారు. సొసైటీ పట్ల కూడా ఆయన బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. పక్కా జంటిల్మేన్. కష్టపడే తత్వం, అంకిత భావం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. నేను ఈ మూవీలో ఏ సీన్ చేసినా… దానికి ముందు ఆయనతో చర్చించి ఆయన సలహాలు తీసుకుని నటించేదాన్ని. నాకు సూర్య గారితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ అనిపించింది.
ప్ర. ‘రాధేశ్యామ్’ వంటి పెద్ద సినిమాకి ముందు రోజు ‘ఈటి’ రిలీజ్ అవ్వడం పట్ల ఎలా ఫీలవుతున్నారు?
జ.నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. రెండు కూడా విభిన్న కథాంశంతో కూడుకున్న సినిమాలు. పెద్ద సినిమా చిన్న సినిమా అని లేదు.. బాగున్న సినిమానే జనాలు చూస్తారు అని నేను నమ్ముతాను. రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అందుకుంటాయి అని నేను భావిస్తున్నాను. అలాగే రాజమౌళి గారి ‘ఆర్.ఆర్.ఆర్’, మణిరత్నం గారి సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. అవి కూడా పెద్ద విజయాలు అందుకోవాలని భావిస్తున్నాను.
ప్ర.మీకు ఇష్టమైన హీరో/హీరోయిన్ ఎవరు?
జ. రజనీకాంత్, సౌందర్య, శ్రీదేవి..నేను నటి అవ్వడానికి వాళ్ళే నాకు స్ఫూర్తి.
ప్ర.మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
జ.’డాన్’ రిలీజ్ కావాల్సి ఉంది. తర్వాత మరో తమిళ్ మూవీకి సైన్ చేశాను. త్వరలో దాని వివరాలు వెల్లడిస్తాను.