Raashi Khanna: హీరోయిన్ రాశీ ఖన్నా.. మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసినట్టే..!

  • May 12, 2021 / 10:06 AM IST

గ్లామర్ డాల్ రాశీ ఖన్నా.. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ‘మనం’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత ‘ఊహలు గుసగుసలాడే’ ‘బెంగాల్ టైగర్’ ‘సుప్రీమ్’ ‘తొలిప్రేమ’ ‘వెంకీ మామ’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. అయితే గతేడాది వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం తరువాత ఆమెకు అవకాశాలు కరువయ్యాయి అనే కామెంట్లు ఎక్కువగా వినిపించాయి.

అంతేకాదు ఆ ఒక్క చిత్రం ఈమె ఇమేజ్ ను చాలా వరకు డ్యామేజ్ చేసింది అనే కామెంట్లు కూడా వినిపించాయి. గత ఏడాది ఈమె వరుసగా ఫోటో షూట్లలో పాల్గొంటుండడంతో ఈ కామెంట్లకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది. అయితే ఈమె సైలెంట్ గా 3 క్రేజీ సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గోపీచంద్- మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ అలాగే నాగ చైతన్య- విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ వంటి సినిమాల్లో నటిస్తోంది రాశీ.

అంతేకాకుండా.. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న ‘సర్దార్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది ఈ బ్యూటీ. ‘అభిమన్యుడు’ వంటి హిట్ సినిమాని అందించిన దర్శకుడు పి.ఎస్.మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇవి మూడు కూడా మంచి అంచనాలు ఉన్న సినిమాలే..! ఇవి కనుక హిట్ అయితే మళ్ళీ రాశీ ఖన్నా పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus