Rakul Preet: ప్రేమలో ఉన్నప్పుడు అలా చేయడం అస్సలు సహించను!

  • June 22, 2023 / 12:59 PM IST

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ విధంగా ఈమె వరుసగా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేదని తెలుస్తుంది. ఇక ఈమె ఆశలన్నీ కూడా ఇండియన్ 2 సినిమా పైనే ఉన్నాయని తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా త్వరలోనే ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక సినీ కెరియర్ పరంగా పక్కన పెడితే (Rakul Preet) రకుల్ ప్రీతిసింగ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నాని ప్రేమలో ఉన్నారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈమె ప్రేమ గురించి ప్రేమలో జరిగే మోసాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ .. ప్రేమకు పెద్ద శత్రువు అబద్ధమని తెలియజేశారు. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా దాపరికాలు ఉండకూడదని తెలియజేశారు.

ఇలా దాపరికాలు ఉన్నప్పుడు వారి ప్రేమ ఎక్కువ కాలం నిలవదని తెలిపారు.మనిషి అన్న తర్వాత తప్పులు చేయడం సర్వసాధారణం అయితే చేసిన తప్పులను ఒప్పుకోవడం ఎంతో గొప్ప అని ఈమె చేశారు. ఇలా చేసిన తప్పులను ఒప్పుకోకపోవడమే ప్రేమకు వచ్చిన పెద్ద సమస్య అని తెలియజేశారు. ఇక చాలామంది ప్రేమలో ఉంటూ తాము ప్రేమించిన వ్యక్తికి ఇష్టం లేకపోయినా ఒత్తిడి చేసి మరి తమకు ఇష్టమైనటువంటి పనులను చేయించుకుంటూ ఉంటారు.

అలాగే మరికొందరు ఎమోషనల్ గా మాట్లాడుతూ మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయాన్ని తాను అసలు సహించని ఈ సందర్భంగా ప్రేమలో జరిగే మోసాలు గురించి మాట్లాడుతూ రకుల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus