స్థానికులను షాక్ కి గురి చేసిన హీరోయిన్ సడన్ డెసిషన్
December 4, 2018 / 12:54 PM IST
|Follow Us
ఆమె కథానాయికగా సినిమాల్లో కనిపించి చాలా రోజులవుతున్నా.. ఇప్పటికీ రమ్య నంబేసన్ అంటే యూత్ లో భీభత్సమైన క్రేజ్. సినిమాలకు స్వస్తిపలికి తన కుటుంబ పెద్దలను అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీలో జాయినై ప్రస్తుతం కాంగ్రెస్ సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్న రమ్య నిన్న రాత్రి ఉన్నట్లుండి బెంగుళూరులో తాను గత కొన్నేళ్లుగా రెంట్ కి ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి తన భద్రతా సిబ్బందితో వెళ్లిపోయిందట. ఉన్నట్లుండి ఇలా అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం ఏంటా అని చుట్టుపక్కల జనాలు కంగారుపడ్డారట.
అయితే.. ప్రస్తుతం ఆమె అనుభవిస్తున్న ఎం.పి హోదాకు త్వరలోనే గండిపడే అవకాశం ఉండడం వల్లే ముందుగానే ఇలా ముందస్తు నిర్ణయం తీసుకొందని తెలుస్తోంది. మరి రాజకీయాలకు స్వస్తిపలికిన తర్వాత రమ్య మళ్ళీ ఏమైనా సినిమాలవైపు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ.. సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తే మాత్రం ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోతారు.