Ranjitha: హీరోయిన్ రంజిత తండ్రి ఆవేదన అశోక్ కుమార్!

  • May 25, 2023 / 11:19 AM IST

ఒకప్పటి హీరోయిన్ రంజిత అందరికీ సుపరిచితమే. ఈమె స్వామి నిత్యానందతో నడిపిన వ్యవహారానికి సంబంధించిన ప్రచారం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే రంజిత తండ్రి కూడా ఒక నటుడే అన్న సంగతి తెలిసిందే. ఆయన మరెవరో కాదు అశోక్ కుమార్. ‘గురువును మించిన శిష్యులు’, ‘బుద్ధిమంతులు’.. వంటి సూపర్ చిత్రాలతో ఇతను బాగా పాపులర్ అయ్యారు. ఆరడుగుల పైనే ఎత్తుగల అందగాడిగా అప్పట్లో ఈయన మంచి పేరు సంపాదించుకున్నారు.

కానీ కొంతకాలానికే సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. నచ్చని పెళ్లి చేసుకోవడం వల్ల ఇబ్బందులు పడి తర్వాత తన భార్యను అక్కున చేర్చుకున్నారు. కానీ ఈయన సంతానమే ఈయనకు తలవంపులు తెచ్చిందంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టారు అశోక్ కుమార్. ఆయన మాట్లాడుతూ.. “నా కుటుంబమే నాకు శత్రువు. నాకు ముగ్గురు ఆడపిల్లలు.. పెద్ద చదువులు చదివించాను. ముగ్గురికీ పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులయ్యాయి. నా రెండో అమ్మాయి (Ranjitha) రంజితకు స్వామి నిత్యానందతో పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి.

అది నిజమో, కాదో నాకు తెలియదు. వాళ్లిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలయితే ఉన్నాయి. ఒక్కటైతే నిజం.. నిత్యానంద వల్లే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి కూడా విడాకులిచ్చింది. దీంతో ఓసారి కోపంతో నేను నిత్యానంద దగ్గరకు వెళ్లి.. ‘నీకు సిగ్గు అనిపించడం లేదా? నా కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కి పంపించు’ అని గట్టిగా అడిగాను. కానీ నా కోపాన్ని, బాధను అర్థం చేసుకునే వాళ్లే లేరు. నిత్యానంద మాయలో పడి నా ఇద్దరు కూతుళ్లు అతని వెంటే వెళ్లారు.

ఇప్పటికీ అతనితోనే ఉన్నారు. ఇదంతా భరించలేక నా భార్య అనారోగ్యానికి గురై మరణించింది. నా మూడో కూతురే నన్ను చూసుకుంటోంది. మిగతా ఇద్దరూ ఇంతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు అశోక్ కుమార్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరోసారి రంజిత వార్తల్లోకెక్కినట్టు కూడా అయ్యింది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus