స్టార్ సింగర్ సునీత జనవరి 9న రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్‌ను ఈమె రెండో పెళ్లి చేసుకుంది. ఇదే విషయాన్ని గతేడాది చివర్లోనే ఈమె తెలియజేసింది. తన ఇద్దరి పిల్లలను అడిగిన తరువాతే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈమె రెండో పెళ్లి చేసుకున్న రామ్ అయితే డిజిటల్ మీడియాలో బాగా సంపాదించాడు. అంతేకాకుండా ఆయనకి ఆస్తులు కూడా ఎక్కువే.! సునీత వివాహాన్ని ఆమె పిల్లలే దగ్గరుండి జరిపించారు.
ఇదిలా ఉండగా.. ‘ఎదిగిన పిల్లలు ఉండగా… ఈ టైములో సునీత రెండో పెళ్లి చేసుకోవడమేంటి’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు నెటిజన్లు. అంతేకాదు సునీత పెళ్లి ఫోటోల పై నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. తాజాగా ఈ విషయాల పై ‘జబర్దస్త్’ రోజా స్పందించి .. సునీత రెండో పెళ్లి పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్న వారి పై విరుచుకుపడింది. ఆమె మాట్లాడుతూ.. “సునీత తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చింది. ఇపుడు తన పిల్లలు, పెద్దల అనుమతితో కొత్త లైఫ్ ను స్టార్ట్ చెయ్యాలి అనుకుంటుంది. అందుకే రెండో పెళ్లి చేసుకుంది.
తన మానానా.. తాను రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితం గడపలాని ఫిక్స్ అయితే.. కొంత మంది పనిలేని ఎదవలు ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళసలు మనుషులేనా?వాళ్ళ కుటుంబంలో కూడా సునీత లాంటి వాళ్ళు ఉంది ఉంటే… ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్లా? మొదటి పెళ్లి తర్వాత పిల్లలతో సంసార బాధ్యతలను నెట్టుకుంటూ వచ్చిన సునీత.. ఇపుడు పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ల అనుమతితోనే రెండో పెళ్లి చేసుకుంది. అది ఆమె వ్యక్తిగత వ్యవహారం. ఆమె రెండో పెళ్లి పై కామెంట్స్ చేసేవాళ్లు.. ఆమె కంటూ పర్సనల్ లైఫ్ ఉంటుదని గుర్తిస్తే బాగుంటుంది” అంటూ రోజా ఘాటుగా చెప్పుకొచ్చింది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
More..
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!