Ruhani Sharma: ఆ హీరోకు పెద్ద అభిమానిని.. రుహాని శర్మ కామెంట్స్ వైరల్!

  • February 5, 2024 / 11:07 AM IST

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైంధవ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను సొంతం చేసుకోని సైంధవ్ మూవీకి ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలో డాక్టర్ రోల్ లో రుహాని శర్మ నటించి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రుహాని శర్మ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

బాల్యం నుంచి వెంకీ సార్ సినిమాలు అంటే ఇష్టమని వెంకీ సార్ కు పెద్ద అభిమానినని రుహాని శర్మ పేర్కొన్నారు. అనుష్క శర్మ విరాట్ కోహ్లీ నాకు దగ్గరి బంధువలని ఆమె వెల్లడించారు. అనుష్క కజిన్ అని విరాట్ కోహ్లీ వరుసకు బావ అవుతాడని రుహాని శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. అనుష్క విరాట్ చాలా సింపుల్ గా ఉంటారని మాతోనూ వాళ్లు క్లోజ్ గా ఉంటారని రుహాని శర్మ చెప్పుకొచ్చారు.

నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టమని షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్లినా స్థానిక వంటకాల గురించి, సంస్కృతి గురించి తెలుసుకుంటానని రుహాని శర్మ పేర్కొన్నారు. ఆరోగ్యం, ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇస్తానని రోజూ చిన్నచిన్న వ్యాయామాలు చేస్తానని తరచూ స్విమ్మింగ్ చేస్తానని రుహాని శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాల్లో గ్లామర్ కు ఓకేనని వల్గారిటీకి మాత్రం నో చెబుతానని ఆమె పేర్కొన్నారు.

షూటింగ్ లేని రోజుల్లో ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇస్తానని రుహాని శర్మ (Ruhani Sharma) అన్నారు. డిగ్రీ పాసైన తర్వాత కొన్ని యాడ్స్ లో నటించానని ఆ యాడ్స్ వల్లే చి.ల.సౌ..! సినిమాలో ఛాన్స్ దక్కిందని ఆమె చెప్పుకొచ్చారు. తోటి మనుషులతో పాటు తోటి జీవుల విషయంలో ప్రేమగా వ్యవహరించాలని రుహాని శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. రుహాని శర్మ రెమ్యునరేషన్ పరిమితంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ బ్యూటీకి మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus