Sai Pallavi: ‘గార్గి’ మూవీ ప్రమోషన్లో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన సాయి పల్లవి..!
July 12, 2022 / 12:36 PM IST
|Follow Us
సాయి పల్లవి హీరోయిన్ గా ‘గార్గి’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ వారం అంటే జూలై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి టీచర్ గా కనిపిస్తుంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా సాయి పల్లవి పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
ప్రశ్న : ‘గార్గి’ సినిమాలో మీకు కొత్తగా అనిపించింది ఏంటి? ఏ పాయింట్ ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని ఆకర్షించింది అనుకోవచ్చు?
సాయి పల్లవి : ప్రతి సినిమాలో నా క్యారెక్టర్ ఎలా ఉంది.. నేను దానికి ఎంత వరకు న్యాయం చేయగలను అని అలోచించి ఓకే చేస్తాను. కానీ ఈ సినిమా విషయంలో నాకు కథ బాగా నచ్చింది.ఎప్పుడూ నా పాత్రల కోసం మాత్రమే కాదు.. ఇలాంటి కథ నేను చెప్పాలి అని అనుకున్నాను. ‘వకీల్ సాబ్’ ‘జై భీమ్’ వంటి సినిమాల తరహాలో ఓ మంచి పాయింట్ ను ఈ సినిమా ద్వారా చెప్పే అవకాశం నాకు దక్కింది అనిపించింది.
ప్రశ్న : ఇది లా పాయింట్ చుట్టూ తిరిగే కథ అనుకోవచ్చా?
సాయి పల్లవి : లా పాయింట్ చుట్టూ తిరిగే కథ అని పూర్తిగా చెప్పలేము. కథలో భాగంగా కోర్టు సీక్వెన్స్ లు ఉంటాయి తప్ప.. వాటి కోసం కథ ఉన్నట్టు ఉండదు.
ప్రశ్న : ‘గార్గి’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అని మీరు అనుకుంటున్నారు?
సాయి పల్లవి : ఇది వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. కచ్చితంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా అలాగే ఆలోచింప చేసే విధంగా ఉంటుంది.
ప్రశ్న : ‘గార్గి’ అంటే ఏంటి?
సాయి పల్లవి : ‘గార్గి’ అనేది ఓ మైథలాజికల్ పదం.ఈ చిత్రంలో నేను టీచర్ పాత్రలో కనిపిస్తున్నాను. పురాణాల్లో తీసుకుంటే సావిత్రి తన భర్తను యముడి నుండి కాపాడుకుంది. ‘గార్గి’ అంటే అలాంటి అర్ధాన్ని సూచిస్తుంది.
ప్రశ్న : ఈ కథని ముందు ఐశ్వర్య గారు చేద్దాం అనుకున్నారట? కానీ మీ వరకు ఎలా వచ్చింది?
సాయి పల్లవి : ఐశ్వర్య లక్ష్మీ.. గారు, డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ మంచి స్నేహితురాలు. ఐశ్వర్య గారు, ఆమె సోదరుడు, డైరెక్టర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారు. మొదట దర్శకుడి మైండ్లో నేను ఉన్నానో లేదో నాకు తెలీదు. ఐశ్వర్య లక్ష్మీ గారు నిర్మాతగా ఉంటూనే ఈ చిత్రంలో ఓ క్యామియో రోల్ చేశారు.
ప్రశ్న : ఒక హీరోయిన్ వద్దకు వచ్చిన స్క్రిప్ట్ ఇంకో హీరోయిన్ వద్దకు పంపించడాన్ని ఎలా తీసుకోవచ్చు?
సాయి పల్లవి : మంచి విషయమే కదండీ… ఒక హీరోయిన్ తన వద్దకు వచ్చిన స్క్రిప్ట్ ను ఇంకో హీరోయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకోవడం.. ఆ స్క్రిప్ట్ కు ఆమె ఇచ్చే గౌరవం అనుకోవాలి.ఆల్రెడీ నిర్మాతగా ఉండి .. నేను కాకుండా వేరే వాళ్ళతో చేస్తే ఈ స్క్రిప్ట్ బాగుంటుంది అనుకోవడం మంచి పరిణామం. అది ఐశ్వర్య లక్ష్మీ గారి గొప్పతనం.
ప్రశ్న : మీరు ఏమైనా అలా మీ వద్దకు వచ్చిన స్క్రిప్ట్ లు ఇంకో హీరోయిన్ బాగుంటుంది అని సజస్ట్ చేశారా?
సాయి పల్లవి : నేను తమిళ్ లో చేశాను. తెలుగులో కూడా చేశాను.. నా బదులు వేరొకరు చేస్తే బాగుంటుంది అని. కానీ నాకు గుర్తు లేదు అది ఏ సినిమా అని.
ప్ర : ‘విరాట పర్వం’ తర్వాత మళ్ళీ ఎమోషనల్ కథలోనే నటిస్తున్నారు ఎందుకు?
సాయి పల్లవి : నిజానికి నేను ‘విరాట పర్వం’ సైన్ చేశాను..దాని తర్వాత ‘లవ్ స్టోరీ’ ‘గార్గి’ ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలకు సైన్ చేశాను.కరోనా వల్ల ఆర్డర్ మారింది. అంతే..!
ప్ర : కమర్షియల్ రోల్స్ కు దూరంగా ఎమోషనల్ రోల్స్ ఎందుకు చేస్తున్నారు?
సాయి పల్లవి : ‘శ్యామ్ సింగ రాయ్’ చేశాను కదా. అది కమర్షియల్ మూవీ. ఎక్కువ చేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది. ఈ అమ్మాయి ఎప్పుడూ ఇలాంటివే చేస్తుంది అని..!
ప్ర :అందులో మీ పాత్ర చనిపోతుంది కదా? అందుకు?
సాయి పల్లవి : నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది.కమర్షియల్ రోల్స్ చేయడం లేదు అని. ఎమోషనల్ రోల్స్ లేదా హెవీ రోల్స్ చేసిన తర్వాత లైట్ వెయిట్ రోల్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది..! నాకు ఉంది. నచ్చిన పాత్రలు దొరకాలి కదా.
ప్ర : తమిళంలో సూర్య గారు ‘గార్గి’ ని ప్రెజెంట్ చేస్తున్నారు. తెలుగులో రానా గారు చేస్తున్నారు?
సాయి పల్లవి : తమిళ్ లో సూర్య గారు ఈ చిత్రాన్ని చూసి ప్రెజెంట్ చేస్తాను అన్నారు. తెలుగులో రానా గారిని ప్రజెంట్ చేయమని నేనే ఫోన్ చేసి అడిగాను. ఆయన వెంటనే నువ్వు ఓ సినిమా చేసావు అంటే మంచి కథ అయ్యి ఉంటుంది. కచ్చితంగా చేస్తాను అని చెప్పారు. అలా ‘విరాటపర్వం’ తర్వాత కూడా మా బాండింగ్ కంటిన్యూ అవుతుంది.
ప్ర : సాయి పల్లవి ప్రెజెంట్స్ అని ఎప్పుడు వస్తుంది?
సాయి పల్లవి : నా ఫిలింకి నేను ప్రెజెంట్ చేయడం ఏమి బాగుంటుంది.మా ‘గార్గి’ టీం అంతా ముందు నుండి అన్నారు. ‘సాయి పల్లవి ప్రెజెంట్స్’ అని వేసుకోమని.కానీ నేను అంత పెద్ద పేరు సంపాదించాను అని అనుకోవడం లేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఓ మంచి కథ చూసి.. నాకు నచ్చింది అనిపిస్తే కచ్చితంగా నేను ప్రెజెంట్ చేస్తాను. సినీ పరిశ్రమ నాకు చాలా ఇచ్చింది. నేను కూడా దానికి తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నాను.
ప్ర : ‘గార్గి’ లో కోర్టు సన్నివేశాల్లో నటించినప్పుడు ఎలా అనిపించింది?
సాయి పల్లవి : దర్శకుడు గౌతమ్ రామ చంద్రన్ ఓ అడ్వాకెట్ కూడా..! అందుకే ఈ సినిమా ని ఆయన చాలా నేచురల్ గా తీశారు.అందుకే నాలా నటించే వాళ్ళకి ఈజీ అయిపోయింది.
ప్ర : మీ పై కేసులు నమోదవ్వడం? మీరు మాట్లాడిన తీరును తప్పు పట్టినందుకు ఏమైనా రిగ్రెట్ ఫీలయ్యారా?
సాయి పల్లవి : నేను రిగ్రెట్ ఫీలవ్వలేదు. మీరందరూ చూసారు కదా. ఆ వీడియో లో ఏముంది అనేది. అది రాంగ్ గా అర్ధం చేసుకున్నారు అనేదే నా బాధ తప్ప నాకు ఎటువంటి నెగిటివ్ ఆలోచన, పొలిటికల్ ఆలోచన ఏమీ లేదు. నేను హిందీలో చెప్పకపోవడం వలన వాళ్లకు రాంగ్ గా కన్వే అయ్యి ఉండొచ్చు. తర్వాత వాళ్లకు అర్థమయ్యేలా వివరించాను. అంతకు మించి ఏమీ లేదు.
ప్రశ్న : మీ తదుపరి ప్రాజెక్టులు ఏంటి?
సాయి పల్లవి : తమిళ్ లో శివకార్తికేయన్, రాజ్ కుమార్ పెరియసామి.. అలాగే ఇంకొక సినిమాకు సైన్ చేశాను. తెలుగులో ఏ సినిమా చేస్తాను అనేది త్వరలో వెల్లడిస్తాను. నాకు అన్ని భాషల నుండి ఆఫర్లు వస్తున్నాయి. మనసుకు ఏది మంచిదనిపిస్తే అదే చేస్తాను. మరీ ముఖ్యంగా నా నుండి డాన్స్ మిస్ అయ్యింది అని కొందరు అడుగుతున్నారు. కచ్చితంగా నా తర్వాతి సినిమాల్లో డాన్స్ నెంబర్ కూడా ఉండేలా చూసుకుంటాను.