Sai Pallavi: ప్రొడ్యూసర్ గా మారనున్న మరో స్టార్ హీరోయిన్..!

  • July 12, 2022 / 10:31 AM IST

ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, దర్శకులు నిర్మాతలుగా మారి సినిమాలు చేస్తున్నారు. దాదాపు పేరున్న హీరోలందరికీ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు సైతం ప్రొడక్షన్ వైపు దృష్టి పెడుతున్నారు. తక్కువ బడ్జెట్ లో సినిమాలను నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ లో అనుష్క శర్మ, తాప్సీ లాంటి స్టార్స్ ఇప్పటికే నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు సాయిపల్లవి కూడా ఇదే రూట్ లో నడవనుందని తెలుస్తోంది.

తనకు కూడా చిత్ర నిర్మాణం వైపు అడుగులు వేయాలని ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చింది. తను నటించిన ‘గార్గి’ సినిమా వచ్చే నెలలో విడుదలవుతోంది. అయితే ఈలోగా ప్రమోషన్స్ మొదలుపెట్టింది సాయిపల్లవి. ఈ సినిమాను చూసిన జ్యోతిక, సూర్యలు తమిళంలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. సూర్య ఈ సినిమా చూసిన చాలా ఇంప్రెస్ అయ్యారని.. తమిళంలో ఈ సినిమా ఆయనే సమర్పకుడిగా వ్యవహరిస్తానని మాటిచ్చారని తెలిపింది సాయిపల్లవి. తమిళంలో సూర్య పేరు మీదే ఈ సినిమా విడుదలవుతుందని చెప్పుకొచ్చింది సాయిపల్లవి.

తెలుగులో ఈ సినిమాను రానా సమర్పిస్తున్నారు. ముందుగా సమర్పకురాలిగా సాయిపల్లవి పేరు వేస్తామని నిర్మాతలు అన్నారట. కానీ దానికి సాయిపల్లవి ఒప్పుకోలేదట. తన సినిమాని తనే సమర్పించుకోవడం ఏమిటని వద్దని చెప్పినట్లు సాయిపల్లవి వెల్లడించింది. అయితే తన దగ్గరకు ఏదైనా మంచి స్క్రిప్ట్ వచ్చి.. ఈ సినిమాను నిర్మించాలని అనిపిస్తే కచ్చితంగా పూర్తి స్థాయి నిర్మాతగా బాధ్యత వహిస్తానని చెప్పింది సాయిపల్లవి. ఈ పరిశ్రమ నాకు ఎంతో ఇచ్చింది.. నేను కూడా ఏదో రూపంలో తిరిగి ఇవ్వాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus