ఒక్క రాత్రికి కోటి ఇస్తానంటూ వేధిస్తున్నారు..!

  • February 2, 2019 / 12:00 PM IST

మంచు మనోజ్ నటించిన ‘పోటుగాడు’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది సాక్షి చౌదరి. తరువాత అల్లరి నరేష్ తో ‘జేమ్స్ బాండ్’ ‘సెల్ఫీ రాజా’ వంటి చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించింది. యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా వచ్చిన ‘ఆక్సిజన్’ చిత్రంలో కూడా ఓ ఐటెం సాంగ్ చేసింది. చూడటానికి పొడుగ్గా… తన గ్లామర్ తో ఆకర్షించే సాక్షి.. త్వరలో ‘సువర్ణ సుందరి’ అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా.. తను అనుభవించిన కొన్ని ప్రతికూల పరిస్థితుల్ని చెప్పుకొచ్చింది.

ఇందులో భాగంగా సాక్షి చౌదరి మాట్లాడుతూ… “నా దగ్గరకు వస్తున్న కొందరు అసభ్యంగా… వస్తావా ? రేటెంత…? అంటూ మాట్లాడారు. కోటిరూపాయలు ఇస్తాను.. ఒక నైట్ కి వస్తావా..అంటూ కొందరు ఆఫర్ ఇస్తున్నారు.. ! అయితే నటి అయినంత మాత్రాన… ఇంత దారుణంగా.. చులకనగా ఎలా చూస్తున్నారు?ఇలాంటి అఫర్లు ఇచ్చేవాళ్ళు పెద్ద మూర్ఖులు. అలాగే నా దగ్గరకి ఇలాంటి ఆలోచనలతో వస్తే మీ బండారాన్ని బయటపెడతాను.. జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాను” అంటూ చెప్పుకొచ్చింది సాక్షి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus