నటి సంగీతకు ఆ చిత్రం విజయం బాగా హెల్ప్ అయ్యింది..!
October 21, 2020 / 07:20 PM IST
|Follow Us
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ , ‘ఆబ్బబ్బబ్బ.. ఇలాంటి ఎమోషన్సు, నెవర్ బిఫోరు నెవర్ ఆఫ్టర్’.. ఈ డైలాగులు చెప్పగానే మనకు టక్కున గుర్తొచ్చే నటి సంగీత. గతంలో ఈమె ‘ఖడ్గం’ ‘పెళ్ళాం ఊరెళితే’ ‘ఖుషి ఖుషీగా’ ‘సంక్రాంతి’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ చేసింది.. అలాగే నెగిటివ్ టచ్ ఉన్న రోల్స్ ను కూడా పోషించి మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగుతో పాటు మలయాళం,కన్నడ, తమిళ భాషల్లో కలిపి 60కి పైగా సినిమాల్లో నటించింది సంగీత. ఇదిలా ఉండగా.. 2009 లో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ అయిన క్రిష్ ను పెళ్ళి చేసుకున్న సంగీత.. తరువాత సినిమాలను కాస్త తగ్గించిందనే చెప్పాలి. 3 ఏళ్ళ తరువాత.. ఈ ఏడాది విడుదలైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది సంగీత. ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక మందన తల్లిగా నటించి మంచి వినోదాన్ని పంచింది సంగీత.
ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలు,నెగిటివ్ టచ్ కలిగిన పాత్రలతోనే పరిచయమైన సంగీతలో కామెడీ యాంగిల్ కూడా ఉందా? అని ఈ చిత్రం ప్రూవ్ చేసింది. ఈ చిత్రం సంగీతకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈరోజు ఈమె పుట్టినరోజు కావడంతో.. మరిన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఈమె దూసుకుపోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.