Actress Sangeetha family: సీనియర్ హీరోయిన్ సంగీత ఫ్యామిలీ పిక్స్ వైరల్..!
November 11, 2021 / 04:42 PM IST
|Follow Us
సీనియర్ హీరోయిన్ సంగీత అందరికీ సుపరిచితమే. నిజానికి ఈమె తమిళమ్మాయే అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది. తెలుగు,తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో కూడా ఈమె సినిమాలు చేసింది. మొత్తం కలుపుకుని ఈమె 65 కి పైగా సినిమాల్లో నటించిందన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ‘ఖడ్గం’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ‘ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
అటు తర్వాత ‘పెళ్ళాం ఊరెళితే’ ‘ఆయుధం’ ‘ఖుషీ ఖుషీగా’ ‘విజయేంద్ర వర్మ’ ‘సంక్రాంతి’ వంటి పెద్ద సినిమాల్లో కూడా నటించింది కానీ స్టార్ స్టేటస్ ను మాత్రం ఈమె సంపాదించుకోలేకపోయింది. అటు తర్వాత కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈమెను పట్టించుకున్న వారు లేరు. అయితే గతేడాది మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ తో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో మహేష్ బాబుకి అత్త పాత్రలో ఈమె కనిపించింది. ప్రస్తుతం ‘ఆచార్య’ ‘ఎఫ్3’ సినిమాల్లో కూడా నటిస్తుంది.
ఇక సంగీత పర్సనల్ లైఫ్ కూడా ప్రేక్షకులకు తెరిచిన పుస్తకమే. 2009 లో క్రిష్ అనే వ్యక్తిని ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంగీత భర్త కూడా నటుడే అలాగే సింగర్ కూడా..! ఈ దంపతులకి ఓ పాప కూడా ఉంది.ఆమె పేరు శివియా. ఇప్పుడు శివియాకు 9 ఏళ్ళు. తన పాపకి సంబంధించిన ప్రతీ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది సంగీత. సంగీత ఫ్యామిలీ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :