Sangeetha: ఒక తల్లి ఎలా ఉండకూడదో అనే దానికి రోల్ మోడల్ మా అమ్మ: హీరోయిన్ సంగీత

  • May 23, 2023 / 02:06 AM IST

తన అందం మరియు అభినయం తో ప్రేక్షకుల మదిలో ఎప్పటికి మర్చిపోలేని స్థానాన్ని దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సంగీత. కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఖడ్గం’ సినిమా ద్వారా ఈమె మంచి పాపులారిటీ ని దక్కించుకుంది. ఇందులో రవితేజ కి జోడిగా నటించిన సంగీత, ‘ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్’ అనే డైలాగ్ తో మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూ బిజీ గా మారింది.

రీసెంట్ గానే ఈమె ప్రధాన పాత్ర పోషించిన ‘మసూద’ చిత్రం విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇది ఇలా ఉండగా ఈమెకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆమె కన్నతల్లి సంగీత పై కేసు పెట్టడం తో సంగీత కన్నతల్లి పై సంచలన ఆరోపణలు చేసింది. ఇక అసలు విషయానికి వస్తే సంగీత తన తల్లి తో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది.

తన భర్త తో కలిసి (Sangeetha) ఆమె పై అంతస్తులో ఉంటే, పెద్ద కుమారుడితో కలిసి ఆమె తల్లి కింద అంతస్తులో నివాసం ఉంటుంది. అయితే సంగీత వాళ్ళ అమ్మ రీసెంట్ గా ‘నా కూతురు నన్ను ఇల్లు ఖాళీ చెయ్యమని వేధిస్తుంది’ అంటూ మహిళా కమీషన్ కి ఫిర్యాదు చేసింది. దీనిపై సంగీత అప్పట్లో వివరణ ఇస్తూ ‘నాకు 13 ఏళ్ళ వయస్సు ఉన్నప్పటి నుండే నా తల్లి నన్ను డబ్బులు సంపాదించే ఒక యంత్రం గా వాడుకుంది.

ముందుకు బానిసలు గా మారిన నా అన్నాతమ్ముళ్లను ఆమె చెడగొట్టింది.ఇప్పటికీ వాళ్ళు పనిపాట లేకుండానే ఉన్నారు. ఇన్ని రోజులు నన్ను జీవితం లో ఆమె ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు నాపై లేనిపోని ఆరోపణలు చేసి జైలుకు లాగాలని చూస్తుంది. ఇలాంటి తల్లి కడుపునా పుట్టినందుకు సిగ్గు పడుతున్నాను, ఒక తల్లి ఎలా ఉండకూడదు అనే దానికి రోల్ మోడల్ మా అమ్మ’ అంటూ అప్పట్లో సంగీత చెప్పుకొచ్చింది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus