కన్నడ బ్యూటీ సంజనని మోసం చేశారు..!

  • August 24, 2017 / 05:08 PM IST

తాజాగా కన్నడంలో ‘దండుపాళ్యం-2’ సినిమాలో నటించిన సంజన గుర్తుందా….అదే అండీ…టాలీవుడ్ లో బుజ్జి గాడు సినిమాలో త్రిషకి చెల్లెలుగా…బావా అంటూ కాస్త రొమ్యాంటిక్ గా పిలుస్తూ చెలరేగిపోయిందె…ఆమెనే…ఈ మధ్య మన పవర్ స్టార్ సినిమా సర్దార్ లో కూడా మెరిసింది….అయితే తెలుగులో ఆమెకు పెద్దగా కలసి రాకపోవడంతో కన్నడంలో తన సత్తా చాటే ప్రయత్నాలు ఎన్నో చేసింది…కాస్తో, కూస్తో వెనక వేసుకుంది కూడా…మరి ఆమెను ఎవరో మోసం చేశారని సోషియల్ మీడియాలో తన బాధను చెప్పుకుంది…అసలు ఏమయింది…మ్యాటర్ ఏంటి అంటే…బెంగుళూరుకు చెందిన ఒక చిట్ ఫండ్ కంపెనీ భారీ మొత్తంలో ఆమెను మోసం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి…అయితే సాధారణంగా చిట్ ఫండ్ లాంటి స్కామ్ లు మధ్య తరగతి కుటుంబాలలోని వ్యక్తులను మోసం చేస్తూ ఉంటాయి.

అయితే అలాంటి మొసంలో ఈమె ఎలా ఇరుక్కుంది అంటే….ఆమె చెబుతున్న మాటల ప్రకారం…బెంగుళూరులోని ప్రసిద్ధి చిట్ ఫండ్స్ 300 మంది కుటుంబాలను మోసం చేసి 17 కోట్ల వరకు స్వాహా చేసిందని, అంతేకాకుండా ఈ చిట్స్ కంపెనీ నడిపిన వాళ్లు బెంగుళూరులో లగ్జరీ లైఫ్ గడిపారని సొంత మెర్సిడిస్ బెంజి కారులో తిరిగారని బోలెడు ఆస్తులు పోగేసుకున్నారని ఆమె చెబుతుంది. అయితే ఈ చిట్ ఫండ్ నిర్వాహకుల పై సోషల్ మీడియా ద్వారా యుద్ధం మొదలు పెట్టిందట ఆమె…మరి ఈ యుద్దంలో ఆమె ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus