Shakeela: నాన్న గురించి చెబుతూ ఎమోషనల్ అయిన షకీలా!
October 27, 2021 / 12:21 PM IST
|Follow Us
సౌత్ ఇండియాలో శృంగార తారగా షకీలా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ షోకు షకీలా హాజరయ్యారు. ఈ షోలో గతాన్ని గుర్తు చేసుకుంటూ షకీలా ఎమోషనల్ అయ్యారు. షకీలా తన తల్లిదండ్రుల గురించి చెబుతూ నాన్నకు తానంటే ఎంతో ఇష్టమని తెలిపారు. బాల్యం నుంచి తనను ఎంతో ప్రేమగా చూసుకునేవారని షకీలా చెప్పుకొచ్చారు. నటిగా సక్సెస్ కావడం కోసం తాను ఎంత కష్టపడ్డానో నాన్నకు తెలుసని షకీలా పేర్కొన్నారు.
సినిమా రంగంలో నటిగా ఎదగడానికి తాను పడిన కష్టాలను నాన్న కళ్లారా చూశారని షకీలా చెప్పుకొచ్చారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో నాన్న తనతో పాటు సెట్స్ కు వచ్చారని షకీలా పేర్కొన్నారు. ఒక సన్నివేశంలో షూటింగ్ లో భాగంగా భవనంపై నుంచి తాను కిందికి దూకాలని ఆ సీన్ వల్ల తన కాలు విరిగిందని షకీలా పేర్కొన్నారు. ఆ సమయంలో నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత సినిమాల కొరకు అలాంటి యాక్షన్ సీన్స్ లో నటించవద్దని నాన్న సూచించారని షకీలా పేర్కొన్నారు. ఈ షోలో అభినయశ్రీ, జ్యోతి, సంపూర్ణేష్ బాబు సైతం సందడి చేశారు. షోలో సుమ షకీలాను డ్యాన్స్ వేయాలని కోరగా డ్యాన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాను డ్యాన్స్ చేయనని సారీ అమ్మా అంటూ సుమ షకీలాతో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తాను ఆడనని తన కొడుకు ఆడతాడని చెప్పగా సంపూర్ణేష్ బాబు షోలో ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు.