Actress: నేటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన నటి సెలీనా!

  • April 8, 2023 / 03:46 PM IST

సాధారణంగా ఇండస్ట్రీలో పనిచేసే హీరోయిన్లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు అబ్బాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. వారికి ఇష్టమైన హీరోయిన్ల ఫోటోలను వాల్ పేపర్లుగా పెట్టుకోవడం, వారితో తరచూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడటం వంటివి చేస్తుంటారు.ఇక కొందరు నెటిజన్స్ అయితే ఏకంగా హీరోయిన్స్ తమకు భార్యగా ఉంటే ఎంత బాగుంటుందో అని కలలు కూడా కంటున్నారు.. ఈ క్రమంలోనే కొంతమంది నేటిజన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరోయిన్లతో మాట్లాడుతూ ఏకంగా వారికి ప్రపోస్ చేసిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.

తాజాగా ఒక నెటిజన్ తనకు ఇష్టమైన (Actress) హీరోయిన్ కిఏకంగా పెళ్లి ప్రపోజ్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ నటిగా మాత్రమే కాకుండా మోడల్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈమెకు ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ తనని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేశాడు. సెలీనా జైట్లీ… నా ఆరోగ్యం అసలు బాగోలేదు నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు.

నా ఆరోగ్యం మరింత క్షీణించక ముందే నన్ను నీతో పాటు తీసుకెళ్లి పో ఇల్లరికం రావడానికి కూడా నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. నా ప్రపోజల్ కు స్పందిస్తావని ఎదురు చూస్తున్నాను ఇట్లు కోల్కత్తా నుంచి విజయ్ మగన్ లాల్ వోరా. అంటూ ట్వీట్ చేశారు అయితే దీనికి స్పందించిన నటి సెలీనా ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె సదరు నెటిజన్ కు రిప్లై ఇస్తూ…

నా భర్తను ముగ్గురు పిల్లలను అడిగి వస్తాను అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సెలీనా మిస్ యూనివర్స్ 2003 రన్నర్ గా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈమె ఆస్ట్రేలియాకు చెందిన ఎంటర్ ప్రెన్యూర్ పీటర్ ను వివాహం చేసుకున్నారు ఈమెకు ముగ్గురు సంతానం. ఇలా మోడల్ గా తన టాలెంట్ నిరూపించుకున్న సెలీనా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో కూడా నటించారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus