Shruti Haasan: మల్టీటాస్క్ చేసేవాళ్లకు ప్రాధాన్యం ఉండేది కాదు.. శృతి కామెంట్స్!
July 9, 2022 / 11:54 AM IST
|Follow Us
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. తన మల్టీ టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాక్టింగ్ మొదలుపెట్టకముందే ఈ బ్యూటీ సంగీతంలో తన టాలెంట్ నిరూపించుకుంది. సింగర్ గా అదరగొడుతూ.. పలు ఆల్బమ్స్ లో తన గొంతు వినిపించింది. అయితే తాను మొదట సినిమాల్లోకి వచ్చినప్పుడు పాటలు పాడతానని చెబితే అందరూ వింతగా చూసేవారని చెబుతోంది శృతి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ప్రభాస్ ‘సలార్’ సినిమా గురించి మాట్లాడింది.
ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని.. ఇందులో తన పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేనని తెలిపింది. మంచి క్యారెక్టర్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నట్లు చెప్పుకొచ్చింది. ‘సలార్’ సినిమాతో పాటు మరో తెలుగు సినిమా కూడా చేస్తున్నట్లు చెప్పింది. అటు బాలీవుడ్ లో కూడా కథలు వింటున్నానని.. ఇంకా ఏదీ ఫైనల్ చేయలేదని చెప్పింది.
తన తండ్రి కమల్ హాసన్ నుంచి చాలా నేర్చుకున్నానని.. తనకు ఐదున్నరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆయనతో కలిసి పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని, మ్యూజిక్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా గొప్ప వారని పొగిడేసింది. తాను మొదట్లో పాటలు పాడతానంటే అందరూ వింతగా చూసేవారని..
మల్టీ టాస్క్ చేసేవాళ్లకు అప్పట్లో పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదని చెప్పుకొచ్చింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయానని, ఎంకరేజ్ చేసేవాళ్లు పెరిగిపోయారని చెప్పుకొచ్చింది.