అభిమానులకు షాక్ ఇవ్వనున్న శృతి హాసన్!

  • December 15, 2017 / 01:03 PM IST

విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మలు విదేశాల్లో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఒక్క మాట కూడా ముందు చెప్పకుండా ఈ ప్రేమికులు పెళ్లి చేసుకోవడంతో రెండు రోజుల పాటు బ్రేకింగ్ న్యూస్ గా మారారు. అలాగే త్వరలోనే శృతి హాసన్ కూడా అభిమానులకు షాక్ ఇవ్వడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణాదిలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న శృతి గత కొంతకాలంగా సినిమాలను ఒప్పుకోవడం లేదు.  లండన్‌కి చెందిన నటుడు మైఖేల్‌ కోర్సేల్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయి… అతనితో కలిసి ముంబయి =లో కాపురం పెట్టినట్టు కూడా అక్కడి మీడియా వార్తలను ప్రచురించాయి.

మైఖేల్‌ కోర్సేల్‌తో శృతి హాసన్ ఉన్న ఫోటోలను కూడా ప్రచురించాయి. ఆ ఫొటోలో మైఖేల్‌, శ్రుతి హాసన్ తో పాటు శృతి తల్లి సారిక ఉండడం విశేషం. పెళ్ళికి తల్లిని ఒప్పించడం జరిగిపోయిందని ముంబై వర్గాలు తెలిపాయి. ఇక తండ్రి కమల్ హాసన్ వైపు నుంచి ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో శృతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని అంటున్నాయి. శృతి హాసన్ శెభాష్ నాయుడు సినిమా మినహా ఏ చిత్రానికి సంతకం చేయకపోవడంతో త్వరలోనే పెళ్లి వార్త వినబోతామని సినీ వర్గాలుతెలిపాయి. అనుష్క శర్మ మాదిరిగా విదేశాల్లోనే శృతి పెళ్లి చేసుకోవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus