వివాహేతర సంబంధాలపై స్నేహ ఉల్లాల్, మధుశాలిని వెబ్ సిరీస్
September 10, 2020 / 03:14 PM IST
|Follow Us
జూనియర్ ఐశ్వర్య గుర్తుందా? అదేనండీ… కరుణాకరన్ దర్శకత్వం వహించిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’తో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన హీరోయిన్. ఐశ్వర్యా రాయ్ పోలికలు ఉన్నాయని ‘లక్కీ’ సినిమాతో స్నేహ ఉల్లాల్ ను సల్మాన్ ఖాన్ హీరోయిన్ చేసాడు. తెలుగులో ‘నేను మీకు తెలుసా?’, ‘కరెంట్’, ‘సింహ’, ‘అలా మొదలైంది’ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు డిజిటల్ స్క్రీన్ మీద కూడా రాణించాలని స్నేహఉల్లాల్ ట్రై చేస్తోంది.
శరత్ మరార్ ప్రొడ్యూస్ చేస్తున్న హిందీ తెలుగు బైలింగ్వల్ వెబ్ సిరీస్ ‘ఎక్స్ పైరీ డేట్’లో స్నేహ ఉల్లాల్ నటించింది. ఆమె డిజిటల్ డెబ్యూట్ ఇది. ఒక ప్రధాన పాత్రలో స్నేహఉల్లాల్ నటించగా, మిగతా ప్రధాన పాత్రల్లో మధు శాలిని, అలీ రెజా, టోనీ లూక్ నటించారు. రెండు కపుల్స్, వాళ్ళ మధ్య ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్స్ నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో సాగే ‘ఎక్స్ పైరీ డేట్’లో ఎవరి భర్తతో ఎవరు ఎఫైర్ పెట్టుకున్నారు? ఎవరి స్వభావం ఎలా మారింది? అనేది ఆసక్తికరమైన అంశమట.
ప్రతి మనిషిలో ఉండే శృంగార భావనలతో పాటు ప్రేమ, పగ, ప్రతీకారం అంశాలతో ఈ సిరీస్ సాగుతుంది. ఫేమస్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ బ్రదర్ శంకర్ కె. మార్తాండ్ దీనికి డైరెక్టర్. జి 5లో ఈ సిరీస్ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. అనూప్ రూబెన్స్ దీనికి మ్యూజిక్ అందించారు. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో ఎఫైర్స్ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ దక్కుతోంది. రొమాన్స్ సస్పెన్స్ మిక్స్ చేసిన ఈ సిరీస్ కి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఆల్రెడీ జీ 5లో వచ్చిన లూజర్ హిట్ టాక్ తెచ్చుకుంది.